Monday, August 16, 2010

కన్నయ్య చెప్పేవి ఒక్కటీ నేను వినను! :-o

కన్నయ్య టీచర్ రోల్లో ఉన్నప్పుడూ చాలానే చెప్తారు.. చాలాసార్లు ఆయన చెప్పేవి కష్టంగానే ఉంటాయి.. కాని ఆయన గురించి చెప్పుకుంటారు ఒక పాఠంలో.. నాకు అది చాలా ఇష్టం.. ఎందుకంటే అన్నిట తను ఉన్నాను అని చెప్తారు.. భలే నచ్చింది నాకు అది.. తనే వెలుగట! తనే ఆనందమట! తనే ఉత్తరాయణమట! బానే ఉంది ఇదంతా.. తాను చీకటి కాదట!! తాను దక్షిణాయణం కాదట!! ఇది నేను అస్సలు ఒప్పుకోలేదు..
ఎందుకు ఒప్పుకోవాలట! రాత్రి నాకు చాలా ఇష్టం కద ( నేను రాక్షస జాతా? :-o).. నాకు మరి దక్షిణాయణం కూడా ఇష్టమే! రాత్రేమో హాయిగా ఆకాశాన్ని చూస్తూ.. ఏ చీకూ చింతా లేకుండా.. ఆ పని ఈ పని చెయ్యాలన్న దిగులు లేకుండా.. ప్రతి దానికి టైం చూడాల్సిన అవసరం లేకుండా.. తినాల్సిన అవసరం లేకుండా.. ఆహా ఎంత బావుంటుంది.. ఇవన్ని ఒక పక్కన ఐతే.. అసలు ఆకాశం ఎంత బావుంటుంది.. ఎన్ని స్టార్స్.. మనకు నచ్చినట్టు మారతాయి! నచ్చినట్టు కథలు చెప్పొచు.. మ్యాజికల్గా ఉంటుంది.. కాని ఆయనేమో నేను కాదు ఇది అంటారు.. నేను ఒప్పుకోను.. నేను చూస్తున్నదే నిన్నే కన్నయ్య... ఆ చుక్కల్లో కూడా.. నిన్ను అర్థం చేసుకోవాలనే నా ప్రయత్నం అది.. నేను గొప్ప యోగిని కాకపోవచ్చు.. కాని ఒంటరిగా నేను అర్థరాత్రి చుక్కల్ని చూస్తున్నప్పుడు.. ఎక్కడో ఏదో ఒక ఫీలింగ్.. ఆ ప్రశాంతతలో నాకు నేను ఇంకొంచం అర్థం అవ్తున్నానని.. లోకం అర్థమవుతోందని.. నువ్వు కనిపిస్తున్నావని..

5 comments:

  1. ఒకటి మాత్రం అర్దమైంది, మీరు నిశాచరులు(రాక్షస జాత) కాదని, కన్నయ్య ఆశాచరులని .

    ReplyDelete
  2. :) sweet.
    as usual ee topic meeda baagaa argue cheyyaccu. but neeto no arguments...

    ReplyDelete
  3. Ping!!!........manchiga unnava....ninna feel ayyinav kadaa ping chesthalee ani ..nee blog la ping cheshinaa...... kush aaaaaaaa ingaaa.....

    ReplyDelete