Thursday, October 28, 2010

స్నేహం !

జీవితంలో చాలా మందిని కలుస్తూ ఉంటాం. ఒక్కొక్కరూ ఒక్కో రకం. నాకు పరిచయం అయిన చాలా మందిలో ఒకటి మాత్రం కామన్. ఎక్కువ మంచితనం నా పట్ల! కొంచం కష్టంగా అనిపించేది అప్పుడప్పుడు.. ఏదో తెలియని భారం.. వాళ్ళ మంచితనం ముందు నేను తేలిపోతానేమోనని! దూరం చేసాను.. నా మంచి ఫ్రెండ్స్ ని.. ఆ మంచితనం భరించలేక..స్వార్థపరురాలని కద! దూరంగా ఉండి మేమందరం కలిసి నవ్వుకున్న రోజులు గుర్తుచేసుకుంటాను ఇప్పుడు అంతే... రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. కాని ఆ జ్ఞాపకాలు అలానే ఉన్నాయి.. వాళ్ళు అందరు ఇంకా అలానే ఉన్నారు.. ఎప్పుడూ నాకు తోడుగా.. అంతే ప్రేమగా!
అలాంటి ఒక ఫ్రెండ్ తో నిన్న మట్లాడాను.. నా బెస్ట్ ఫ్రెండ్తో.. ఆ గొంతులో బాధ విన్నాను.. నేను మాట్లాడకుండా పెట్టిన బాధ! ఎంత క్రూరురాలిని కదా అనిపించింది! కాని తను అస్సలు ఏమి అనలేదు.. మాట తీరూ మారలేదు.. అదే ఆప్యాయత! "నువ్వు ఆనందంగా ఉండు.. నీకు నచ్చింది చెయ్యి.. మాకు అది చాలు!" తను చెప్పిన మాటలు..
అలా ఎలా ఉంటారు అనిపించింది.. ఎన్ని రోజులు గడిచినా.. ఎన్ని గాయాలు అయ్యినా.. ఎంత బాధపెట్టిన... ఆ ఆప్యాయత అస్సలు తగ్గకుండా.. స్నేహం అంటే ఇలానే ఉంటుందా? అలా ఐతే నేను ప్రపంచంలో అందరికంటే లక్కి గర్ల్ ని!

8 comments:

  1. miru nijamgaane lukky girl anta manchi snehitulani pondinanduku.naku asuya gaa vundi mi mida

    ReplyDelete
  2. లక్కీ‍గర్ల్ నిజమే :)
    సృష్టిలో ఓ సూత్రం వుంది మనలోవున్న లక్షణాలు గలవాళ్ళనే మనం ఆకర్శిస్తాం. అంటే మీలో ముందు ఆ మంచితనం ఉందన్నమాట :)

    ReplyDelete
  3. నీ లాంటి మంచి వాళ్లకి సర్వత్రా మంచి ఫ్రెండ్స్ దొరకుతారు

    ReplyDelete
  4. భావావేశపు అలలు సద్దుమణిగి
    లోపలికి ఆలోచనల వెలుగు వ్యాప్తి చెందితే
    కడలి ఆకాశాన్ని అందుకోవాలనుకోదేమో
    ఆశ పడ్డ ఆకాశాన్ని నిందించకుండా
    దాని అందాన్ని ఆస్వాదిస్తుంది
    ప్రశాంతతలో అంతఃప్రకాశంతో తన అందాన్నీ ఆస్వాదిస్తుంది

    అపుడు ఎవరికి వారికి ఎవరెవరు ఏంటో ద్యోదకమవుతుంది

    కడలి ఆకాశానికి దూరంగా ఉంటూనే ఆవిరై చేరుతుంది
    ఆకాశం కడిలికి దూరంగా ఉంటూనే తియ్యని వాన జల్లై వాలిపోతుంది

    ReplyDelete
  5. Sita, I liked this blog.So much that it dragged me into commenting . And you know how often I comment! I have similar experiences with my circle too and guess what! Ramya is right, you are one of them ...

    ReplyDelete
  6. దిలీప్ గారు, మీ కవిత చాలా చాలా బాగుందండి.....కల్మషం ఉండని మనస్సుని ఆవిష్కరించారు.


    మీరు నిజంగానే చాలా అదృష్టవంతులైవుంటారు సీత.... reminds me of a saying 'యద్భావం తద్భవతి'- మనసెలాంటిదైతే అలాంటివే జరుగుతాయట...

    ReplyDelete