మీకే గనక టైం ట్రావెల్ చేసె అవకాశం వస్తే ఎక్కడికి వెళ్తారండీ? అప్పడికప్పుడు ప్లాన్ చెయ్యాలీ అంటే కష్టం కదా.. అందుకే నేను ముందుగానే ఒక లిస్ట్ రాసేసుకున్నాను మరి!
పెద్దగా సమయం వేస్ట్ చెయ్యకుండా.. ముందుగా
రాముడి పెళ్ళికి అతిథిగా వెళ్తాను.. ఆ వైభోగాన్ని కళ్ళారా చూస్తాను!
ఇక ఎలానూ రాముడి కేవలం సీతకే కద.. అక్కడి నుంచి బయలుదేరి మరో ఆలోచన లేకుండా.. కన్నయ్య దగ్గరకు వెళ్తాను.. అక్కడే ఉండిపోతాను కొద్దిరోజులు.. మరో ఆలోచన లేకుండా.. ప్రశాంతంగా.. సేవ చేసుకుంటూ..
అక్కడి నుంచి మహభారత యుద్ధం చూస్తాను కొద్ది రోజులు.. ఇక చాలు అని అనిపించినప్పుడు.. బయలుదేరి వెనక్కి వెళ్ళి.. వశిష్టుడిని కలుస్తాను.. ఆయన జ్యోతిష్య శాస్త్రం మీద చేసిన పనులు చూస్తాను.. నేర్చుకుంటాను. తర్వాత ఆర్యభట్ ని కలుస్తాను.. తర్వాత ఒకసారి భరత ఖండం మొత్తం చుట్టేస్తాను.. ఇక చూసిన గతం చాలు అనిపించెస్తుంది.. ఇక్కడ అన్నిటిని వదిలేసి కొత్త లోకాన్ని వెతుకుతూ రేపటిలోకి వెళ్ళిపోతాను!
ఏమో ఇంత చూసాక.. అసలు past present future ఉండవని అర్థమవుతుందేమో! కాలమే లేదని అర్థమవుతుందేమో!
"గతించిన కాలము మిన్న, వచ్చు కాలము కంటెన్" అని కవి వాక్కు కదా... నేనయితే అంత మంచి కాలంలోకి వెళ్ళగలిగితే రామ రాజ్యంలో శాశ్వతంగా వుండిపోతాను. ఇక మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే చాన్సే లేదు.
ReplyDeleteabba yenta asa hi hi hi
ReplyDeleteall the best
నాలుగు యుగాలను ఒక్క బ్లాగ్ పోస్ట్ లో పట్టించేసావ్... ఇంకా ఎవరన్నా మిగిలారా కలవడానికి. బాగా ముదిరిపోయింది :D
ReplyDelete>> ఏమో ఇంత చూసాక.. అసలు past present future ఉండవని అర్థమవుతుందేమో!
ఇదంతా జరిగితే ఇంక భూత భవిష్యత్ వర్తమానాలేంటి... పండక్కి ఊరెళ్లొచ్చినట్టు పోతుంటే :)
ముందుగా
ReplyDeleteరాముడి పెళ్ళికి అతిథిగా వెళ్తాను.. ఆ వైభోగాన్ని కళ్ళారా చూస్తాను!
నేను కూడా ఇది నా లిస్టు లో రాసి పెట్టుకున్నాను. నిజంగా బావుంది ఈ పోస్ట్.