Monday, May 31, 2010
కలయో నిజమో వైష్నవమాయో తెలిసీ తెలియని అయోమయంలో!
మొన్నొకరోజు ఏదో పుస్తకం చదువుతుంటే ఈ ఆలోచన వచ్చింది.. మనం చూస్తున్న ప్రతి ఒక్కటీ వెలుగే కద.. విసిబిల్ లైట్ రేంజ్లో అవి రిఫ్లెక్ట్ చెయ్యడం వల్ల మనం చూడగలుగుతున్నాం. కనిపించనివీ.. మాజిక్ అనుకునేవి ఏమో.. మనకి కనిపించని లైట్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి! సూర్యుడి దగ్గరనుండి వెలుగు భూమిని తాకడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది .. మీరు రిఫ్లెక్ట్ చేసిన లైట్ నా కంటికి తాకడానికి కూడ కొoత సమయం పడుతుంది మరి (అది ఎంత చిన్న సంఖ్య ఐనా కూడా). అప్పుడు మొదలయ్యింది నా confusion: మనం ప్రెసెంట్ అనుకుంటున్న ప్రెసెంట్, ప్రెసెంట్ కాదు పాస్ట్ అని!!! :-o
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు!
ఇదివరకు ఎప్పుడూ అంతగా మరి పరీక్షించలేదు అనుకుంట... ఏదో అలా సాగిపోతుంది జీవితం అనుకునేదాన్ని ఏమో.. ఈ మధ్య కొంచం తీక్షణంగా గమనిస్తున్నా.. మరుక్షణం ఎలా ఉంటుంది అని అస్సలు చెప్పలేం. బాబోయ్ చాలా Unpredictable!
Ratatouille సినిమాలోని ఈ మాట నాకు చాలా నచ్చుతుంది..
"The only thing predictable about Life is its Unpredictability!"
Ratatouille సినిమాలోని ఈ మాట నాకు చాలా నచ్చుతుంది..
"The only thing predictable about Life is its Unpredictability!"
Sunday, May 30, 2010
రాధా హృదయం మాధవ నిలయం!
దీనబంధు దేవాలయంకి వెళ్ళాను నిన్న.. అనుకోకుండా హారతి సమయానికి వెళ్ళాను. అబ్బా అసలు కన్నయ్య ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేను.. సంకీర్తనలు చేస్తు ఉన్నారు.. చాలాసేపు అక్కడే ఉన్నాను.. ఎందుకో మనస్సు అస్సలు బాలేదు.. ఎవరితో మాట్లాడాలో తెలియక ఆయన దగ్గరకే వెళ్ళాను. మరి నాకు కొంచం భాగ్యం కలిగించాలి అనుకున్నారో ఎమో పూజకి తులసి దళాలు కావలసి వస్తే అందులో నాకు సేవ చేసే అదృష్టం దక్కింది. కన్నయ్యా ఇంక నాకు పరీక్షలు వద్దు.. చాలా కష్టంగా ఉంటోంది. త్వరగా వచ్చెయ్యి నువ్వు! ఐన నిన్న గుడిలో తథాస్థు అన్న ప్రతీసారీ నేను కన్నయ్య కావాలి కావాలి అంటూనే ఉన్నాను :P
Saturday, May 29, 2010
జగమే మాయ..
ఈ రోజు నా స్నేహితురాలి వల్ల పొద్దున్న పొద్దున్నే 'మాయాబజార్ సినిమా గుర్తుకువచ్చింది. ఇక వచ్చిందే తడవుగ చూడటం మొదలుపెట్టాను. మాయాబజార్ శశిరేఖ అభిమన్యుల అందమైన ప్రేమ కథ! ఇక నా కృష్నుడి గురించి చెప్పనే అక్కర్లేదు.. ఆయన జగన్నాటక సూత్రధారి ! అబ్బ నా కృష్నుడు ఇలానే ఉంటాడేమో అన్నట్టుగా ఉంటారు NTR గారు.. మళ్ళీ మళ్ళీ చూడలనిపించే విన్నావటమ్మ ఓ యశోద, లాహిరి లాహిరి లాహిరి లో.. సావిత్రి గారు, SVR గారు, ANR గారు అంతా కలిసి ఒక సుమనోహర దృశ్యకావ్యం!
ఇక మరి టాటా .. నేను శశిరేఖ కళ్యాణానికి వెళ్ళాలి!
ఇక మరి టాటా .. నేను శశిరేఖ కళ్యాణానికి వెళ్ళాలి!
Friday, May 28, 2010
A Frozen Star!
ఎప్పుడో 10వ తరగతిలో నేను రాసుకున్న డైరీ మొన్నెప్పుడో నా కంటపడింది.. సరేలే అని తిరగేసాను. మొదటి పేజీలో నేను రాసుకున్నది ఇది:
"నేను ఒక బ్లాక్ హోల్ లాంటి దానిని.. ఎవరికి అర్థంకాను.. కొన్ని కొన్ని సార్లు నాకు కూడా!!!"
వెనక్కితిరిగి చూస్తే నేనా ఇది రాసింది అనిపిస్తోంది! అంతగా ఆలోచించానా అప్పుడు! ఇలా నన్ను చూసి నేను వండర్ ఫీల్ అవ్వకూడదనో ఎమో ఈ మధ్యన డైరి రాయడం బొత్తిగా మానేసాను.. :(
FYI - Blackholes were once called the 'Frozen Stars'!

వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే.. నా ముద్దు గోవిందుడే!
"ఇక మాటలు చాలించు ఆ గోపబాలుడితో.. అతగాడి మైకంలో పడిపొతున్నావు.. ఏముంది వాడిలో.. నల్లటి రూపు, వెన్నదొంగ, ఆడవాళ్ళని ఆటపట్టించేవాడు.. ఏమిటి వాడితో అంత దోస్తీ?"
ఏదొ సినిమా డైలోగ్లా ఉంది కదా... అచ్చం ఇలాగే నన్ను కూడా మా అమ్మ తిట్టింది!!!!
"24 గంటలు కృష్న కృష్న ఎమిటి? ఆ భగవత్ గీత చడవడం ఇక ఆపు... అతనితో సాన్నిహిత్యం అంత మంచిది కాదు!!!" -- అమ్మ మాటలు!
అబ్బ .. ఏదో సినిమా క్లైమాక్స్ సీన్లా ఉంది.. భలే ఉంది.. ఇక నా కృష్నుడి ఎంట్రీ మాత్రమే మిగిలి ఉంది.. రా రా కృష్నయ్యా.. నన్ను తీసుకుని పోవయ్యా!!

రాధ, రుక్మిణి, మీరా!
ఈ కాలంలో రాధలా ఉండటం కష్టం.. కాని ఆ మోహనాంగుడి మదిలో ఉండాలి!
మీరాలా ఉండటం అంతకంటే కష్టం.. సరైన చాఇస్ కాదు!
అందుకే నేను రుక్మిణిలా ఉండాలి.. కృష్నుడి ప్రియ భక్తురాలిగా, ఆయన భార్యగా!
మీరాలా ఉండటం అంతకంటే కష్టం.. సరైన చాఇస్ కాదు!
అందుకే నేను రుక్మిణిలా ఉండాలి.. కృష్నుడి ప్రియ భక్తురాలిగా, ఆయన భార్యగా!
నక్షత్రాలు, గ్రహాలు, నేను!
ఆస్ట్రొనొమి మీద ఉన్న మక్కువో ఎమో కానీ.. నేను తిథులు మంచి రోజులు గట్ర పెద్దగా నమ్మను. ప్రతి రోజు చంద్రుడు ఒక కొత్త నక్షత్రం దగ్గర ఉండటం.. రేపు ఎక్కడ ఉంటాడా అని గెస్స్ చెయ్యడం, నక్షత్రాన్ని బట్టి మాసం చెప్పడం, నా ఫెవరెట్ నక్షత్రాల కోసం ఎదురు చూడటం, ప్లానెట్స్ ని వెతకడం, అవి ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి వెల్లడం, అలా ఒకరోజు ఆకాశం నుంచి మాయం అవ్వడం, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకూ ఎదురుచూడటం, ఇది నా చిన్ని హాబీ!
కాని అదేంటో మరి, మనం మనలో వచ్చిన మార్పులకి గ్రహస్తితులను కారణంగా చెప్తాం, ఆ మార్పు పెద్ద వాళ్ళకి నచ్చకపొతే శాంతులు చేపిస్తారు కూడా! ఎందుకిలా ఎప్పటికి దూరంగా ఉన్న ఆ చుక్కలని కారణంగా చూపిస్తారు? మనలో వచ్చే ప్రతి మార్పు మంచైనా చెడైనా (మంచి చెడు అని ఏవి ఉండవట, చెడు అనేది ఉంటే ఎవరూ చెయ్యరట!) అవి కేవలం మన మీద ఆధారపడి ఉంటుంది. భాధ్యత తీసుకుంటే అసలు ఎన్నో ప్రొబ్లెంస్ చిటికెలో సోల్వ్ అవుతాయి కదా! ఈ విషయం మా అమ్మ వాళ్ళు అర్థం చేసుకుంటే బావుండును!
నా ఫెవరెట్ స్టార్స్ గురించి నా ఫెవరెట్ పాట..
http://www.youtube.com/watch?v=HabrmCs7nFA

Wednesday, May 26, 2010
అగ్ని పరిక్షలు ఇంత కష్టంగా ఉంటాయా??
కథలో చదివి.. కథలు విని.. ఏమో అనుకున్నాను కాని.. సీతమ్మవారు మాములు వారు కారు! ఆ లెవెల్లో కాకపోయిన.. నా లెవెల్లో పరీక్షలు పాస్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది మాస్టారు.. ఒకదాని తర్వాత ఒకటి.. బోర్ కొట్టెస్తోంది ఇంక.. ఇక చాలు.. ఇంత ఫైట్ చాలు.. కొంచం బ్రేక్ కావాలి. విసుగు పెరిగిపొతుంది .. కృష్నుడి మీద కోపం వచ్చే అంత పెరుగుతోంది!
Monday, May 24, 2010
మనసా తుళ్ళిపడకే...
మనసుకంటే వేగంగా మరేది పరిగెత్తలేదంట.. ఆలోచనల పర్వానికి అడ్డేలేదట! నా మనసు తలుపులు తెరిచి చూస్తే..
అందమైన బృందావనం.. గోపిక రమణుల మధ్యన నా కృష్నుడు.. ఆయన పాదాల చెంత నేను.. ఆ సుమనోహర రూపాన్ని ఆరాధిస్తు.. ఆయన ధ్యానంలో నన్ను మరచి!!
తిరిగి ఈ లోకానికి వస్తే.. జానకిగారు పాడిన ఈ పాత జ్ఞప్తికి వచ్చింది..
"మనసా తుళ్ళిపడకే.. అతిగా ఆశ పడకే.. అతడికి నువ్వు నచ్చావో లెవో.. ఆ శుభ ఘడియ వచ్చేనో రానో.. తొందర పడితే అలుసె మనసా.. తెలుసా మనసా!!"

Sunday, May 23, 2010
బంగారు తల్లి నేను!!!
బండెడు బట్టలు.. వాటికి మళ్ళి గంజి పెట్టడాలు .. ఇస్త్రీ చెయ్యడాలు.. మీరే చెప్పండి.. నేను బంగారు తల్లినా కాదా?
Friday, May 21, 2010
ఏమిటో ఈ ఆనందమాయేటి మనసు కథ?
మంచి పుస్తకం, చల్లని గాలి, ప్రశాంతమైన ఆకాశం, ఆకాశం నిండా చుక్కలు, మా తాతగారు చెప్పే నా రాముడి కథలు, ఆమ్మలోని మమకారం, నాన్నగారి దగ్గిర పప్పులేవి ఉడకకపొవడం, ఘంటసాల పాటలు !!!!!!!
Impressing Myself -- నా మనసు కథ!
నన్ను నేను మెప్పించుకునే ప్రయత్నంలో మొదటి అడుగు.. ఈ బ్లొగ్!
సన్నజాజి తీగ.. పండు వెన్నెల.. ఘంటసాల స్వరం.. నా డైరీ ..
తిప్పి చూస్తె అందులొ ఎన్నో ముచట్లు..
సిటి రంగు పూసుకుని.. ఉరుకులు పరుగులు సాగె ప్రస్తుత జీవితంలో.. కేవలం నాకోసం.. నా ఈ చిన్ని కానుక!
సన్నజాజి తీగ.. పండు వెన్నెల.. ఘంటసాల స్వరం.. నా డైరీ ..
తిప్పి చూస్తె అందులొ ఎన్నో ముచట్లు..
సిటి రంగు పూసుకుని.. ఉరుకులు పరుగులు సాగె ప్రస్తుత జీవితంలో.. కేవలం నాకోసం.. నా ఈ చిన్ని కానుక!
Subscribe to:
Posts (Atom)