Wednesday, June 30, 2010

బుజ్జమ్మా నీకోసం!

ఎప్పుడూ నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తారు..సాదరణంగా కుటుంబంలో చాలా పాప్యులర్ అయ్యి ఉంటారు.. ఎందుకంటారు? ఎముందిటా వాళ్ళలో.. అని ఆలోచించాను.. కొన్ని విషాయాలు గమనించాను! సాదారణంగా మనం చేసే ఆలోచనని అనుసరించి తర్వత ఎం జరగాలో ఆధారపడి ఉంటుంది అనుకుంట! అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామో  అది తర్వత క్షణంలో ఏం అవ్వలో decide చేస్తుంది.. అంటే ప్రస్తుతానికి తర్వాతి క్షణం శూన్యం :-o ఇప్పుడు నేను నవ్వుతూ హాపిగా ఉంటే.. తర్వాతి క్షణం కి పునాది హప్పినెస్స్ కదా! అదే నేను బాదపడుతూ, కుళ్ళిపోతు :P ఉంటే ఎంత చెత్తగా ఉంటుంది దాని నుంచి వచ్చేది. అసలు universe మొత్తం ఇదే principle ఎమో.. అది ఎలా expand అవ్వాలో మన నుంచి ఇంపుట్స్ తీసుకుంటుందేమో! ఆ కొత్తగా తాయారయ్యె spaceమన energies మీద ఆధారపడితే? ఆలోచించండి మనం కొట్టుకుంటూ, ద్వేషించుకుంటూ, అరుస్తూ పిచ్చి పిచ్చి గా ఉంటే లోకం ఎమయిపోతుంది.. ఆ బాధ్యత మన మీద ఉంది కదా.. అసలు ఇక డల్ గా ఉండి, బాద పడుతూ ఉండటం వేస్ట్.. ప్రతి క్షణం ఆనందంగా ఉండంది.. మీరు చేసే పని లోకకల్యాణం కోసమే!:D మన కివచ్చే బాదలు, కష్టాలు అసలు నథింగ్!! 'Be Happy Always!'

Tuesday, June 29, 2010

ఇలా మీకెప్పుడైనా జరిగిందా?

అబ్బా.. ఏంటో ఈ మధ్యన అన్ని కొంచం ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో.. అదేంటో మరి.. ఓకె ఇది డ్రాప్ చేద్దాం.. ఇది బావుంటుందేమో అనుకుంటాను.. కొద్ది రోజులకి నేను ఏమని అనుకున్నానో అదే జరుగుతుంది మరి... as if నేనే నా ఫ్యూచర్ రాసుకుంటున్నట్టు... :-o సత్యా అన్నారు.. దీనిని 'thought regulation' అంటారని.. ఇలా చూస్తే ఏది ముందు రాసిలేదనిపించింది.. మనం ఈ రోజు చెసే దాని మీద space-time fabricలో changes వస్తాయేమో! interestingగా ఉంది.. :)

Monday, June 28, 2010

...

అలిగాను, అరిచాను, తిట్టాను..
అలా ఐనా నీకు దూరం అవ్వాలని..
పట్టించుకోలేదు, మాట నిలబెట్టుకోలేదు,
చాలా సార్లు నిన్ను బాదపెట్టాను..
అల ఐనా నువ్వు నన్ను ద్వేషిస్తే బాగుండునని..
నీ మంచితనం చాలా కష్టం గా ఉంటుంది..
నిన్ను కలవలేదు, మట్లాడలేదు..
కలిస్తే.. మట్లాడితే.. మళ్ళీ బాదపడతానేమో అని..
నిన్ను కలవడం నిజం గా అంత బాదగా ఉంటుందా?? నీతో మాటలు అంత గుచ్చుకుంటాయా??
కాదేమో.. అంత అమాయకత్వాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందేమో..
ఆ మాటలు పదే పదే వినిపిస్తాయేమో...
నీకు అలవాటు పడిపోతానేమో...
నేను నువ్వైపోతానేమో అని భయమేమో..
ఎంత వెతికినా.. నాలో స్వార్థమే కనిపిస్తోంది నాకు...
ఎప్పుడూ నీతో ఉండాలనే స్వార్థం..
మరి నువ్వేమో అందరాని చంద్రుడివాయే..

బిజీ బిజీ లైఫ్!

బాబోయ్ ఏంటో ఒక్కసారిగా చాలా బిజీ అయిపోయాను అనిపిస్తుంది.. అస్సలు వేటికి టైం ఉండట్లేదు.. 7 టూ 7 ఆఫిస్.. వంట.. అమ్మ చెయ్యమన్న పూజలు..యోగా..నిద్ర.. చ్చి చ్చి.. అసలు స్టార్స్ చూడటానికి కూడా టైం ఉండట్లేదు..నాకు కుదరనప్పుడే స్కై చాలా క్లియర్గా ఉంటుంది.. కాని మొన్న ఒకరోజు వీలు చూసుకుని చాలా సేపు చూసాను. Lyra, Aquilla,Cygnus,Capricorn,Centarus ఇవి చూసాను! కాని ఆ రోజు స్కై లో highlight Scorpion! అబ్బ చాలా చాలా వయ్యారంగా ఉంది.. కుదిరితే మీరు కూడా చూడండి..  

Thursday, June 24, 2010

మేఘమా!!

నాకు మబ్బులూ, వాన, పౌర్ణమి... పెద్దగా నచ్చవు. నచ్చవూ అంటే నక్షత్రాలు చూడటం కష్టంగా ఉంటుంది వీటివల్ల! నిన్న రాత్రి కూడా చాలా మబ్బులు ఉన్నాయి.. కాని చాలా ఎక్కువగా గాలి కూడా ఉంది.. ఆహా ఇంకేంటి అవి అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి! సో నక్షత్రాలు కూడా కనిపించాయి! చంద్రుడేమో అనూరాధకి , జ్యేష్ట కి మధ్యలో ఉన్నాడు.. చాల సేపు అలా వాటిని చూస్తు ఉండిపోయాను.. నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది.. సరదాగా మేఘాలతో కొంచంసేపు ఆడుకుందామని.. అంతే వాటికి పేర్లు పెట్టడం మొదలుపెట్టాను.. నేను ఒక హంసని చూసాను.. హంస మీద ఎవరో ఉన్నారు కూడా.. నేను ఒక శంఖం ని చూసాను... చాలా తాబేళ్ళని చూసాను.. 'Finding Nemo' గుర్తుకు వచ్చింది! బాగా నచ్చింది ఐతే నెమలి.. అదేంటో దాని ముక్కు ఒక మబ్బులో, వెనక తోక ఇంకో మబ్బులో.. మధ్యల్లో fill in the blank లాగా ఖాళీ ఉంది :-o కాని చాలా బవుంది అది... తర్వాత ఏముంది చాలా చల్లగా అయింది బయట.. లోపలకి వెళ్ళిపోయాను... అనుకున్నాను దేవుడితో ఒక డీల్ చేసుకుందామని.. పొద్దున్నంతా వాన పడొచ్చు, మబ్బులుండొచ్చు.. కాని రాత్రి మాత్రం ఎప్పుడూ క్లియర్ స్కై ఉండాలి నాకోసం! కేవలం నాకోసం!!

Wednesday, June 23, 2010

పవర్ కట్, ఫుడ్ కట్!

 రోజూ పొద్దున్నే చాల హడవిడిగా ఉండటం వలన.. కృష్నుడికి నైవెద్యంసాయంత్రం పూట పెడతాను!మా మహానగరంలో నిన్న కూడా పవర్ కట్! ఏదో నేను expertని కాబట్టి అలానే వంట చేసెసుకున్నను.. కాని ఈ చీకటి గోలలొ ఒక విషయం మర్చిపోయాను.. నిన్న కృష్నుడికి ఫుడ్ పెట్టనేలేదు!! పొద్దున్న గుర్తుకు వచ్చింది.. కాని నా మీద తప్పు ఉండకూదదు అని.. పవర్ కట్ ఐతే నీకు ఫుడ్ కట్ అని చెప్పి ప్రసాదం పెట్టాను! నేను రాక్షసిని! పాపం మాధవుడు :(

Tuesday, June 22, 2010

బాలానాం రోదనం బలం!

అన్నారు పెద్దలు :P ఇది ఎవరు చెప్పారో కాని వాళ్ళ కాళ్ళకి ఒకసారి నమస్కారం పెట్టాలి! ఎందుకని అంటారా?? నేను మా ఇంటి దగ్గర పిల్ల రాక్షసుల్ని బాగా ఎడిపించేసి వాళ్ళ అమ్మ కాని నాన్న కాని వస్తే ఇదే మాట చెప్పి పంపించేస్తాను! ఏమన్నా అందాం అంటే వాళ్ళందిరికి నే ఫ్రెండ్ ఆయే.. ఏమి అనలేక ఒక్క చూపు చూసి ( నీకు పిల్లలు పుట్టరా.. మేము ఎడిపించమా.. అని చెప్తుంది ఆ చూపు!) .." బుజ్జి భలే అల్లరి పిల్ల ఆంటీ.. ఇల్లంతా సందడే" అని మా అమ్మకి చెప్పేసి వెళ్ళిపోతారు!!! అలా మా కాలనీలో నాకో ఇమేజ్ ఉంది.. మా అమ్మ నా నామస్మరణ చెయ్యడం వల్లనో, లేదా పిల్లల ఏడుపుల వల్లనో, లేదా చీకటి పడ్డాక లెగ్ టచ్ ఆడి తిట్లు వినిపిస్తుంటేనో.. తెలిసిపోతుంది నేను ఇంట్లో ఉన్నానని :D
" ఏంటోనండి పద్మగారు.. మీ చిన్నమ్మై ఇంట్లో ఉన్నట్టే తెలియదు అసలు.. మీ పెద్దమ్మాయి వస్తే ఒకటే సందడి ఇంట్లో" అంటారు మా పక్కింటి ఆవిడ.. నాకు మాత్రం సున్నితంగా నా గురించి మా అమ్మకి చాడీలు చెప్తున్నట్టు అనిపిస్తుంది.. ఇంకేముంది మా అమ్మ మొదలుపెడుతుంది.. "ఇంకా చిన్నపిల్లవి కాదు నువ్వు.. వచ్చినప్పటి నుంచి చూస్తున్న.. అందరితో గొడవ పడటం, ఐనా నీకు ఇంకా ఆటలేంటే?, రోడ్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరు నిన్ను పలకరించాలా?? ఇలాగే చెయ్యి.. సాయంత్రం నాన్న రాగానే నువ్వు చేసిన పనులన్ని చెప్పేస్తాను... " నేను ఇంక పిల్లిని అయిపోతాను.. ఇదేమన్నా న్యాయమా?? మీరే చెప్పండి... :(
అప్పుడు మా అమ్మ అంటుంది.. "బాలానాం రోదనం బలం" అని!!!

Monday, June 21, 2010

నా పెట్ doggy సిరి!

ఈ పోస్ట్ పెంపుడు కుక్కల గురించి అస్సలు కాదు! ఈ రోజు ఏదో మాటల మధ్యన వచ్చిన funny ఆలోచన.. నాకు స్కైలో నచ్చే కొన్స్టలెషన్స్ లో Orion ఒకటి! Orion ఒక వేటగాడైతే, అతనికి రెండు కుక్కలు కూడా ఉన్నాయి! వాటిలో ఒక స్టార్ 'Sirius' !! ఇంతకి ఏంటంటే నేను క్రియేట్ చేసిన మొదటి ఈమైల్ id 'Orion' ఉంటుంది.. సిరి చేసింది 'sirius'. అంటే.. నేను హంటర్.. సిరి నా స్వీట్ Doggy!! :D

సిల్వర్ జూబ్లీ సెలెబ్రెషన్స్ - నా wishlist :D - 6 Days to go!!!

ఈ పోస్ట్ వచ్చే పదిహేను రోజుల వరకు నేను update చేస్తూ ఉంటాను!! నాకు ఏమేమి కావాలో రాస్తూ ఉంటాను! మరి గబగబా నా గిఫ్ట్స్ నాకు పంపించెయ్యండి :D

1. నాకు క్లియర్ స్కై కావాలి! 'వేగా' ని చూడాలి!! నేను పుట్టినప్పుడు వాళ్ళు పంపిన గిఫ్ట్ ఇంకో పదిహేను రోజుల్లో నా దగ్గరకి వచ్చేస్తుంది!!!!
(సరే సరే.. కొందరి కోరిక మేరకు ఈ గిఫ్ట్ ఎంటో రాస్తున్నాను! 'వేగ' మనకు సుమారు 25 లైటియర్స్ దూరంలో ఉంది! అంటే అక్కడి నుంచి వెలుగు ఇక్కడికి రావడానికి 25 సంవత్సరాలు పడుతుంది!!! నేను పుట్టినప్పుడు బయలుదేరిన లైట్ ఈ సంవత్సరం ఇక్కడికి వస్తుంది! చాలా స్పెషల్ గిఫ్ట్ కదా? నేను చాలా ఎక్సైటెడ్!! :) )

2. శతతార చూడాలి!! నా స్టార్ అది!!!!

జై హనుమాన్

మీలో ఎవరికైనా కలలో బూచోళ్ళు వచ్చి భయపెట్టిస్తారా? నన్నైతే చాలా భయపెట్టిస్తారు :( నిద్రపోవడం.. కలలు కనడం, భయపడటం, ఉలిక్కిపడి లేవడం.. ఇది నాకు చాలా కామన్ విషయం. నిన్న యోగా టీచర్ని అడిగాను.. నన్నే ఎందుకు భయపెడతారు బూచోళ్ళు అని??( చిట్టి సీతా... నువ్వు భయపడితే చాలా బావుంటావేమో :P ) మా టీచర్ చెప్పారు.. నిద్రపోయే విధానం మార్చుకోవాలని... బోర్లా పడుకోకూడదని.. ఎడమ వైపు తిరిగి పడుకోవాలని.. లేచే అప్పుడు కుడివైపు తిరిగి లేవాలని!!! వీటన్నిటితోపాటు.. హనుమంతుణ్ణి ఈ శ్లోకంతో గుర్తుచేసుకోవాలని

రామస్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం |
శయనేయ స్స్మరే నిత్యం దుస్స్వప్నం తస్యనశ్యతి ||

ఈ మంత్రం చదువుకుని పడుకుంటే.. హనుమంతుడు మనం పడుకున్నాక వచ్చి మన పక్కనే ఉంటాడు అంట :) నేనైతే హనుమంతుడు సినిమాలో ఉన్నట్టే ఊహించుకున్నాను.. పేద్ద గధ పట్టుకుని కూర్చున్నట్టు... బూచోళ్ళు ఖబడ్దార్!!

P.S: పిచ్చి పిచ్చి కలలు వస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు.. చాలా చిరకుగా భయం భయంగా ఉంటుంది.. ఈ పోస్ట్ ఇలా నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ ఐతే చాలు!

రాజధాని నగరంలో!! :-o

నాకు వేసవిలో ఐతే అమావస్య రోజు అలా సాయంత్రం ఓ గంట కరెంటుపోతే ఇష్టం. హాయిగా చాలా నక్షత్రాలు కనిపించేస్తాయి! అదే వేరే కాలంలో.. అంత చక్కగ నక్షత్రాలు కనిపించనప్పుడు.. పౌర్ణమి రోజు కరెంట్ పోవచ్చు. వినాల్సిన మాటలు వినకపోవడం.. అనవసరమైన వాటిని మాత్రం విని మళ్ళి అనుగ్రహించటం కేవలం కృష్నుడికే సొత్తు.. ఏం చేసాడు అని అడగండీ.. ఎదో పాపం పిల్లకి వారం అంత పని ఉంటుందె.. శని,ఆదివారాలే కదా వాళ్ళు ఎక్కువ సేపు పడుకున్నా.. సినిమాలు చూసినా, బట్టలు ఉతికినా.. అని కొంచం కూడా లేకుండా.. పొద్దున్న పోయింది కరెంట్.. ఇంకా వస్తుంది వస్తుంది అని కళ్ళు కాబేజీ లాగా అయ్యేవరకు చూసి.. ఛీ ఛీ ఇక బాగుపడదు ఈ దేశం అని ఆ కాబేజ్ ని వండుకుని తినాల్సి వచ్చింది!! చెత్త వీకెండ్!

Friday, June 18, 2010

నీ ఆనందమోహన వేణు గానమున.. మానసమలైపొంగెరా!

ఏంటి ప్రతిక్షణం ఈ గోల.. నా మనసు నా చెంత లేని వేళ.. చేసే పని అంతా గారడీల మేళ !!

నీ ఊహలే ఊసులైన వేళ... లోకమే కనుమరుగైన వేళ..!

నీ మనసులోని మాటలు మంచు ముత్యాలై రాలే క్షణం..
నా హృదయ మందిరం అవుతుంది వెన్నెల్లో బృందావనం... !!

నువ్వు లేనినాడు నీ ఊహలే నా శ్వాస..
నువ్వు ఉన్ననాడు నా లోకం నిండా ఆశ..

కోరుతున్నాను నీతో సంగమం.....
లోకం గుర్తుంచుకుంటుంది మరో ప్రేమాయాణం!! :D

P.S: ఎప్పుడో డైరీలో రాసుకున్నది :P

కాఫీ తాగకూడదటండి.. మరీను!

అబ్బబ్బా.. ఇప్పుడు Anemia ఉంటే కాఫీ తగ్గిస్తే మంచిదట.. మానేస్తే మరీ మంచిదట! అసలు కాఫీ మానెయ్యమని సలహా ఇచ్చిన వాళ్ళని గండు చీమలు కుట్టెయ్యాలి! మరి లేకపొతే ఏంటంటా.. చెత్త సలహాలు! అందుకే నేను ఈ విషయంలో ఎవ్వరి మాట వినదలచుకోలేదు.. వినను :D ఆహ్.. భలే చల్లగా ఉంది.. వెళ్ళి కాఫీ తాగి వస్తానే! :)

కలయా నిజమా!

నిద్రపోవడం ఆలస్యం.. నాకు కలలు మొదలవుతాయి! అవి కూడా చాలా వైవిధ్యభరితమైన కలలు వస్తూ ఉంటాయి.. కొన్ని కలలకి నేను భయపడితే.. కొన్నింటికి నేను పక్కన వాళ్ళని భయపెట్టిస్తూ ఉంటాను.. :P కాని నిన్న రాత్రి (for a change..) ఒక మంచి కల వచ్చింది. కలలో సీన్ ఇది: నేను మా నాన్నగారికి కాల్ చేసాను.. మా మధ్య మాటలు ఇలా సాగుతున్నాయి!   

నేను: ఎలా ఉన్నారు నాన్న? జ్వరం తగ్గిందా? 
నాన్న: బావున్నాను అమ్మ.. ఇంతకి నీకు కృష్ణా ఫోన్ చేసాడా? ( ఇది నా expression కలలో: :-o) 
నేను: కృష్ణా నా??? 
నాన్న: చేస్తాను అని చెప్పాడే?

తర్వాత గుర్తులేదు.. :(

నాన్న కి కాల్ చేసాను... నిజంగానే కృష్ణుడి గురించి చెప్తారేమో అని! 

నేను: ఎలా ఉన్నారు నాన్న? 
నాన్న: ఏంటి ఇంత పొద్దున్నే కాలు?
నేను: ఊరికే నాన్న ( :( ) గుర్తొచ్చి.. బెంగ గా ఉంటేనూ..  
నాన్న: చిన్న పిల్లవా ఇంకా.. లేచి ఇంక ఆఫీస్ కి బయలుదేరు.. ఉంటాను మరి.. 

కాల్ కట్!!! :( 

మానినీ చిత్తచోరా!

రుక్మిణీ కళ్యాణంలో కనిపించింది ఇది! బావుంది కదా! నా కృష్ణుడికి ఇంకో పేరు!!

లేదా ఆ పేరు కృష్ణుడిది అని తెలిసాక నచ్చుతుందేమో! :P

Wednesday, June 16, 2010

మరువకుమా ఆనందమాయేటి మనసు కథ!

అదేంటో కాని నేను ఒక్కోసారి చాలా చెత్త మూడ్లోకి వెళ్ళిపోతాను. ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకూ బాధపడటం తప్పించి ఇంక ఏమి చెయ్యను. బాధపడడం ఆ రోజు నా అజెండాలో ఒక భాగం అయిపోతుంది. తుమ్మినా దగ్గినా పిల్లి ఎదురువచ్చిన.. ప్రతిది నన్ను ఇంకా బాధపెట్టడానికి జరుగుతున్నాయి అని ఫీల్ అవుతా.. చిన్నప్పటి నుంచి ..అంటే న 3rd క్లాస్లో నన్ను ఎవరో అన్న మాటలు కూడా గుర్తుచేసుకుని మరీ ఫీల్ అవ్తాను. నన్ను ఎవరన్నా కన్విన్స్ చెయ్యడానికి వచ్చారో ఇక ఆ రోజు వాళ్ళ సంగతి అంతే! అసలు నాకెమన్నా పిచ్చా!!! @#$%&!!!బుద్ధి ఉండక్కర్లేదూ? బాధగా ఉంటే మంచి విషయాలు గుర్తుచేసుకోవచ్చు కదా! నేను ఎంత special అని చెప్పుకోవచు కదా! అలా కాకుండ ఏవేవో సోదిమాటలు గుర్తుచేసుకుని బాధపడుతున్నానంట! మళ్ళి దానికి ఒక పోస్ట్ కూడా రాస్తున్నానట! ఛి ఛి! బుజ్జమ్మా.. ఈ సారి కోపం వచ్చిన బాధవచ్చిన ఇది చదువు.. నీకు గుర్తుకు వస్తుంది నువ్వేంచెయ్యాలో! హాయిగా ఆనంద్ సినిమా చూసుకో!!! :D

' ...నిజమైనాయి కలలూ, నీలా రెండు కనులలో! మరువకుమా ఆనందమాయేటి మనసు కథ!!"

Monday, June 14, 2010

సూపర్ వీకెండ్! :D

శనివారమంతా ఆహ ఎంత బాగ గడిచిపొయిందో! వాన పడింది బాగా ( బట్టలు ఉతికి కూడ వేస్ట్ అయిపోయింది :( ).. కరెంట్ కూడా లెదు.. పొప్చొర్న్ తింటూ హాయిగ పాటలు వింటూ సాయంత్రం గడిచిపొయింది. తర్వాత 'Kites' అనబడే కామెడి సినిమా చూసాను! ఒకరోజులో మనిషి ఇంతకంటే ఎక్కువ ఎంజొయ్ చెయ్యకూడదని ఇక పడుకునిపోయాను!
ఆదివారం.. ఒక ఫ్రెండ్ ఇంటికి వస్తానని చెప్పాను! కాని ఉదయం ఎందుకు అంత త్వరగా వస్తుంది :( అలా పడుకున్న..ఇలా అలార్మ్ మోగింది :( ఏదో వంక చెప్పి డుమ్మా కొడదాం అనుకున్నా.. కాని వెళ్ళాను. తీపి ఆవకాయ తిన్నాను.. భలే ఉంది :) బోలెడన్ని కబుర్లు చెప్పేసుకున్నాం.. అనుకోకుండా యోగా టీచర్ దగ్గరకి కూడా వెళ్ళాను. ప్రాణయామం చేపించారు! ఒక Alienని కూడ కలిసాను! ఆహ్! What a day! అనుకోకుండా నాకు నచ్చిన పనులన్ని చేసేసాను!!!!

హ్యూమన్ టేల్-1!

సోమవారం మొర్నింగ్..నిద్ర లేచి.. తయారయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. పిచ్చిపిచ్చిగా చల్లగా ఉంది. కాని కాబ్ వచ్చేసింది.. ఆఫీస్కి వెళ్ళాలి తప్పదు.. :( I think this is real Life! :(

Friday, June 11, 2010

ఫైరీ టేల్ - 1

సోమవారం మొర్నింగ్..నిద్ర లేచి.. తయారయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. పిచ్చిపిచ్చిగా వాన మొదలయ్యి అన్నిటికి సెలవు ఇచ్చెయ్యాలి!!! Woooooow! అప్పుడు ఆ climateలో కాఫీ తాగుతూ "ఆనందమాయేటి మనసు కథా.....!"  
హాయిగా పుస్తకం చదువుకుంటూ రోజంతా, పాటలు వింటూ, చాలాసేపు పడుకుని, అబ్బా మిరపకాయ బజ్జీలు తిని!! ఆహా ఎంత బావుంది.. I think this is Life!!! :D

Thursday, June 10, 2010

ఈ వారం వార్తల్లోని ముఖ్యాంశాలు!

1. నేను వానలో తడిచాను.. అది కూడా పదినిమిషాలలో ట్రైన్ ఎక్కాలి అనగా! ice cubes తిన్నాను కూడా!
2. టెలెస్కొప్ కొనాలి అని అనుకున్నాను! 20పౌండ్స్ ఉంది ఎలా మోస్తావే పిచ్చమ్మా అనింది సిరి :(
3. భాగ్యనగరం బహు బాగుగా ఉంది!
4. తోటరాముడు రాసిన కొత్త పోస్ట్ చాల బాగుంది! (అది ఎవరికి కనిపించదు!!)
5. పోయిన వీకెండ్ highlights: Venus, mars, saturn and jupiter!

చిట్టచివరిది.. అన్నిటికంటే కూడా ముఖ్యం అయినది

6. నేను కృష్నుడు కొట్టుకున్నాం.. మాటలు లేవు ఇద్దరి మధ్యన!  

Wednesday, June 9, 2010

క్షణికం నా భావం!

క్షమించాలి.. ఈ పోస్ట్ తెలుగు స్క్రిప్ట్లో లేదు.. ఇది నేను చాలా రోజుల క్రితం రాసాను. ఇప్పుడు మార్చే ఓపికలేక అలానే షేర్ చేస్తున్నాను..


Disclaimer:
Nenu gatha 10months ga work chesthunna field valanemo ee post raasthunnadi.... idi kevalam na opinion matrame...

Bhavalani ne artham chesukuntunna vidhanam:

Ippudu na eduruga unna na board ni choosi raasthunna post idi... Board ante SoC unna system under development... daniki ma life ki unna similarities.. operating system ki ma brain ki unna polikalu... ide na post lo unna matter..

Asalu manushulu + vallu chese panulu + valla aalochana vidhanam.. ivi anni oka manchi programmer chethulo nunchi jaalu vaarina muthyalemo anipisthundi...

oka chinna register setting manam ela aalochinchalo change chesthundi.. mana senses ni maarusthundi...
asalu thoughts anevi.. threads lantivi.. (btw thread is a process in execution)
multi threading kani multi tasking kani.. ilanti multi--- manaki ee roju kotha ga undochu .. kani mana body lo already avi pakka ga implemented things..
anthenduku.. udayam ee time ki nidra levali ani okasari me brain ki cheppi padukondi.. aa time ki meeku mrng melukuva vasthundi.. ante andulo voice recognition+scheduling+alarm+wakeup call. inni okesari panichesthunnayi...
anthenduku meeru ekkuva sepu work chesthe chala chala alasipotharu.. entha ante inka emi cheyyaleremo ane anthaga.. idi choosthe mana transistors operate avthunnapudu heat ni produce chesthayi kada.. appudu vaade heat sinks ki mana nidra ki( appudappudu thalaki pette oil ki) difference emanna unda?

Ika mana thoughts ela process avthayo chepthanu... emo adi pipelined execution la anipisthundi naku...
Actually mana thoughts annitini process cheyyadaniki pipelining use avthundemo anipisthundi.. konni sarlu konni thoughts madhyalone aagipothayi... i gues adi cache miss kani invalid memory access kani ayyi untundi... and please dont ask me how big is the pipeline.. i have no idea..
Instruction fetch step lo.. mana thoughts ni already mana brain form chesina oka database tho compare chesthundi.. danini batti adi process cheyyalo vaddo decision avthundi... andukenemo chala sarlu mana thoughts execute stage ki vellavu...

Ippudu threads avochu... kani veetanitiki memory chala important kada.. kondaru konni vishayalani ekkuva gurthu pettukuntaru... konni ala fade ayipothayi...
veeti reason naku okati anipisthundi.. execution appudu avi ram lo untayi.. tarvata vaatini main memory lo store cheyyala vadda annadi run time decision untundi.. leda idi kooda past history ni base chesukuni avthundi....
kontha mandiki memory thaggipothu untundi.. deeniki reason may be memory read write maximum limit ki daggara padatam emo.. and memory baga undali ante honey lantivi thaagali antaru.. deenini vinte naku DRAM refresh time gurthuku vasthundi...

For example, prema ane oka thread ni theesukundam.. prathi ammai leda abbai oka certain stage ki reach ayyaka ila feel avvadam manam choosthu untam.. naku emanipisthundi ante.. mana brain lo unna aa past history story mechanism lo ekkado oka chota idi imprint ayyi untundi.. ila feel avochu ani.. kani ala andarini choosthe anipinchadu kada ani adagochu... adi enduku ante.. prathi okkariki okko frequency untundi... vaalla frquency mana range lo unnappudu.. and vaallu mana trust zone lo ki vachinappuudu( e concept arm nunchi copy kottanu) ala feel avthu untaremo anipisthundi.. idi kooda entha frequent ga anipisthundi annadi complete ga adi ekkada store avthundi anna dani meeda depend avthundi.. adi ram lo aithe immediate ga flush ayipothundi.. cache lo unda main memory lo unda annadani meeda dani impact different ga untundi.. kani aa memory chip marchesina marukshanam prema doma jaantha nahi....

ee concept prema ke kaadu... elanti thread ki aina equal ga hold avthundi.. endukante lopala work chesthunna processor ki ivi anni kevalam ... 0's and 1's.. bhavalu anevi paina unde application layer ichina peru matrame....


Anduke ilantivi evi serious ga theesukovaddu.. anni lite...
and idi intha abrupt ga end cheyyadaniki kiran anabade thirty party application kaaranam :-)

P.S: ikkada thoughts ni threads ani chala chotla vaadatam jarigindi

Tuesday, June 8, 2010

నేను సినీనటి శ్రీలక్ష్మి ఈ విషయంలో పోటిపడతాం!

చెప్పలేని ఎన్నో భావాలకి అక్షర రూపం ఇవ్వాలనుకున్నా..!
కాని, ఆ భావాల సుమపరిమళాలు అలా గాలిలో ఏకమై మమేకమై, నిన్ను చేరాలంటూ పరిగెడుతున్నాయి!!
కొంటే గాలి నీ గురించి చెబుతున్న కబుర్లు, నన్ను ఈర్ష్యపడేలా చేస్తున్నాయి..
కనీసం గాలిలో ఐనా కలిసి హద్దులు దాటి సరిహద్దులు తెంచి నిన్ను చేరాలనే కోరికతో... "నేను"!!!!

P.S: అచ్చంగా ఆవిడ రాసే కవితలానే రాసానంటారా?  

నేను మా క్లాస్ లీడర్ని!

చాలా సంవత్సరాల క్రితం మాటలు! నేను క్లాస్లో ఫర్స్ట్ బెంచిలో కూర్చుని అందరికంటే ముందే హోంవర్క్ చేసేసి, ఎక్కువ మార్కులు తెచేసుకుని, మంచి పిల్ల అనిపించుకునే రోజులనమాట (ఛి ఛి.. వినటానికే చిరాకుగా ఉంది ఇప్పుడు!)!! మచ్చుకకి నేను చేసిన కొన్ని సైకో పనులు ఇవి: మరి బయొలొజిలో ఎదో చదువుకుని రమ్మన్నారు మా సర్.. మరుసటి రోజు నన్ను అడగమన్నరు కొందరిని.. చెప్పని వాళ్ళకి నేను ఇచ్చిన శిక్ష బెంచ్ మీద నుంచోపెట్టడం! ఇప్పటికీ నాతో ఒక అమ్మాయి మట్లాడదు! ఇంకోసారి ఒక అమ్మాయి పాపం ఫొనో ఎదో తెస్తే వెంటనే వెళ్ళి టీచర్ కి చెప్పేసాను! ఇంత జరిగినా బుద్ధిలేక మళ్ళీ నన్ను ఇంజినీరింగ్లో అమ్మాయిలకి రిప్రెసెంటేటివ్ని చేసారు.. అందరూ క్లాస్ బంక్ కొదితే నేను మా సర్ ముందు నుంచి వెళ్తూ కనబడటం వల్ల అందరికి పనిష్మెంట్ వచ్చింది.. నాకు తప్ప! ఛి ఛి ఛి నేను బాడ్ గర్ల్ని!

I have a lucky pen, lucky number Nine!

మీకు పరిచయం చెయ్యబోతున్న తరువాతి క్యారెక్టర్ మా బిందు రవళిక! చూడటానికి ఎలుక పిల్లలా ఉన్నా (ఇక అలా అనుకూడదట!చిన్నపిల్లల బ్లాక్ నుంచి పెద్దపిల్లల బ్లాక్ కి మార్చారట!!) మాటలు మాత్రం పెద్ద ఆరిందాలా మట్లాడేస్తుంది! నా లక్షణాలు కొన్ని బానే పునికిపుచుకుంది! ఎంత తెలివి అంటే 2.5yrs అప్పుడే చంద్రుడు అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటాడు అని కనిపెట్టేసింది మరి! హా ఇంతకి విషయం ఏంటంటే మీరెప్పుడన్న ఆ గేం ఆడారా?? "I have a lucky pen, lucky number Nine!" మా బిందు వాళ్ళ స్కూల్లో నెర్చేసుకుని నన్ను ఆడతావ చస్తావా అని బెదిరించి మరీ ఆడించింది. ఆడిన తర్వాత నాకు తెలిసిన రెండు విషయాలు: 1.పిల్ల రాక్షసులకి పని ఉండదు, 2.వాటికి ఓపిక ఎక్కువ!! నేను మరి అంతలా ఆడాను కాబట్టి.. అది ఏవరో ఒకరికి నేర్పించకుండా ఉండలేకపోయాను. వెంటనే మా చెల్లిని పట్టుకున్నాను.. తర్వాత ఏముంది.. ఏడ్చుకుంటూ మా అమ్మ దగ్గరకి వెళ్ళింది.. అమ్మా నాకు ఈ అక్క వద్దూ అంటూ! :(                            

ఓ చిన్ని సిల్లీ ఆలోచన!

గత మూడు నాలుగు రోజులుగ స్కై ఎవరన్నా చూసి ఉంటే గమనించే ఉంటారు.. మార్స్ రెగ్యులస్ పక్క పక్కన ఉండటం, వీనస్ ఏమో జెమినిలో ఉండటం! నిన్న నేను ట్రైన్లో నుంచి అలా చూస్తుండగ.. ఎందుకో ఆకాశంలో ఉన్న కలర్స్ జుపిటర్ atmosphereని గుర్తుచేసాయి! ఒక పేద్ద గ్రహం చుట్టూ మనం కాని తిరుగుతున్నామా అనిపించింది!

Thursday, June 3, 2010

ఔరా పంచకల్యాణి పైనా వస్తాడంట యువరాజు ఔనా?

అదేంటో మరి నా ఫ్రెండ్స్ కొంతమంది నేను ఊహలపల్లకిలో ఉగుతానని అంటూ ఉంటారు.. అవునండి ఉగుతాను.. తప్పేంటిట? నా ఊహలు నా ఇష్టం! మచ్చుకకి నా ఆలోచనలు కొన్ని:

1.నాకు కూడా రోజు 'The Big Friendly Giant' వచ్చి మంచి కలలు ఊదివెళ్తే బవుండనిపిస్తుంది.. రోజూ అనుకుని పడుకుంటాను!  
2.నాకు బీచ్లో కూర్చుంటే: కాళ్ళకి తగిలే అలలని చూస్తే ఎవరో నాట్యం చేస్తున్న ఫీలింగ్... నడి సముద్రాన్ని చూస్తే ఎవరో గంభీరమైన expression ఇచినట్టు అనిపిస్తుంది!
3.నాతో నా చుట్టు పక్కల ఉన్నవి అన్నీ మట్లాడుతు ఉంటాయి అని ఇంకో ఫీలింగ్! ఒకసారి వాన కావాలి అంటే వర్షం పడింది మరి!
4.నేను రాసిన నా మొదటి ప్రేమలేఖ ఎవరికో తెలుసా: Martiansకి! :D దీని మీద ఒక పోస్ట్ మళ్ళి ఎప్పుడైనా రాస్తాను.
5.10వ తరగతిలో ఏదో పండక్కి ఇంట్లో చాలా మంది చుట్టాలు వచ్చారు.. అందరి మధ్యలో అలా ఆడుతు పాడుతు వెళ్ళి అమ్మతో అన్నమాట: "నేను నన్ అవ్దాం అనుకుంటున్న!!" అలా ఆ క్షణం అందరికీ ఒక్క నిమిషం ఆగిపోయింది :D
6.ఒకరోజు పొద్దున్నే నిద్రలెచి 'Buddhism' తీసుకుంటున్నా అని చెప్పాను ఇంట్లో.. :D ఆ తర్వాత మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించగలరు అనుకుంట!
7.వంటికి exercise మంచిది.. అంతే మరుసటి రోజు నా రూమీ ని నాలుగింటికి లేపాను. techparklo మూడు రౌండ్లు! ఇక మళ్ళీ వెళ్ళలేదు.
8.నాకు ఘంటసాల పాటలు, చెర్రీస్ చాలా ఇష్టం. ఇవి ఇష్టం లేనివాడికి టేస్ట్, బుద్ధి రెండూ లేవని నా ఫీలింగ్!

ఇలాంటివి కోకొల్లలు! వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే.. రేపటికి ఇవన్ని మారిపోతాయి!
ఇంతకీ ఈ పోస్ట్కీ, పోస్ట్ పేరు కి ఏంటి సంబందం అనేనా మీ డౌట్.. అది ఇంకో ఊహ!
 

నేను, కాచిగూడ ఎక్ష్ప్రెస్స్

ఈ పోస్ట్ రాయడానికి కొన్ని పరిస్థితులు, ఇంకా కొన్ని దుష్ట శక్తులూ (అనగ నా ఫ్రెండ్ ఒకడు) నన్ను బాగా ప్రభావితం చేసాయి. నాకు కాచిగుడ ఎక్ష్ప్రెస్స్ కి ఉన్న అవినాభావ సంబందం అలాంటిది మరి!ఆ ట్రైన్ లో S14 ఇంకా S1 నా అడ్డాలు! ఒకసారో రెండుసార్లో జరిగితే పర్లేదు కాని.. నా కేస్లో గత కొద్ది నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. నేను టికెట్ బుక్ చేస్తే ప్రతి సారి నాకు ఐతే ఆఖరి భోగి లేదా మొదటి భోగి! ఇవి తప్ప వేరేవి రావు! ఒకసారి ఐతే అసలు హద్దులు దాటి S14 72 వచ్చింది :-o(ఆ ట్రైంకి అదె ఆఖరి బెర్త్..) .. ఈ రోజు మళ్ళీ ప్రయాణం మీకు పెద్ద డౌట్ ఏమి వద్దు.. మళ్ళీ అవే!

జోలాజోలమ్మ జోలా.. జేజేలా జోలా!

మీలో ఎంత మందికి జోలపాటలు ఇష్టమో నాకు తెలియదు కానీ.. నాకు మాత్రం ఎవరన్నా జోలపాటలు పాడి... ఫైరీ టేల్స్ చెప్తే ఎంత ఇష్టమో!!! చిన్నప్పుడు పాడినవి నాకు గుర్తులేవు.. కాని మా సిరి నాకోసం పాడుతూ ఉంటుంది.. "ఉయ్యాలలూపరమ్మా ఈ బిడ్డ ఓంకార రూపుడమ్మా.." నాకు అసలు ఈ జోలపాట భలే ఇష్టం! ఇక మనం ఆ పాట నేర్చేసుకున్నాం.. నాకు ఆ పాట పాడాలి అని అనిపించినప్పుడల్లా.. ఇంట్లో చెల్లి ని ఎప్పుడంటే అప్పుడు పడుకోమంటాను.. నేను ఇంక స్వరం అందుకుంటాను.. :P ప్రజల కోరిక మేరకు ఒకసారి సిరి కి నేను జోలపాట పాడాను.. లాలి లాలి పాట... ఒక 2నిమిషాల తర్వాత అది నిద్రపోయింది.. నిద్రపోయిందో మూర్ఛపోయిందో నాకు తెలియదు!    

నల్లనయ్యా పిల్లనగ్రోవిలోనా .. వెల్లువై ఎద పొంగిపోదా!

బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకూ?
గోవిందుని లీలా మకరందము అందరికీ అందించుటకూ...

గోకులమున ఏ కులమైనా గోపాలుని కొలిచేదెందులకూ?
కులము అనే వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు..

నల్లానల్లని మేఘంలాగా నదిచొస్తాడు ఎందులకూ?
చల్లని కరుణామృత ధారలలో మనలను ముంచి వెళ్ళుటకు..

చెంగుచెంగుమని గోవుల మందలు పరుగులు తీసేదెందులకూ?
చెంత చేరి గోవిందుని సన్నిధి పరమపధం అని చాటుటకు..

ఈ పాట పాండురంగడు సినిమా లోనిది.. నాకు ఇష్టం!

PS: ఈ బొమ్మ కృష్నుడు నాచేత వేయించాడు.. :)

Wednesday, June 2, 2010

నేను, నా వంట!

నాకు అప్పుడప్పుడూ (పైత్యం ఎక్కువైనప్పుడు) చాలా చిత్రమైన ఆలోచనలు వస్తాయి! అలాంటిదే ఒకటి మొన్న వచ్చింది. వంట చెయ్యడం నేర్చుకోవాలీ అని! అమ్మకి చెప్తే నాలుగు అక్షింతలు వేసింది.. చెయ్యాల్సినవి సరిగ్గా చేసి ఏడువు..లేనిపోని పనులు ఎందుకు నీకు? ఇంటికి వచినప్పుడు కావాలంటే ట్రై చెయ్యి.. వెధవ్వేషాలు వద్దు! కానీ నేను ఒకసారి ఎదన్నా అనుకుంటే ఇంక దానికి వదలను కద.. ఆఫిస్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళాను షాపుకి.. సరుకులు కొనడానికి! నేను కొన్నవి: తాలింపు దినుసులు, నూనె, కారం, 3 రామ ములక్కాయలు, 3 వంకాయలు,4 పచ్చిమిరపకాయలు, నాలుగు ఉల్లిపాయలు, రెందు రెబ్బల కరివేపాకు, 3 వెల్లుల్లి! నేను కొన్న కూరగాయలు చూసి ఆ షాపు వాడు నవ్వలేక 10rs మేడం అన్నాడు :D ఇంత కొని నేను ఉప్పు కొనడం మర్చిపోయాను అంటె.. నాలొ ఒక గ్రేట్ కుక్ కనిపించింది నాకు. మళ్ళీ వెళ్ళి ఒక 0.5Kg బియ్యం, ఉప్పు, పెరుగు కొన్నాను. ఇంటికి వచ్చి.. రెచ్చిపోదాం అని డిసైడ్ అయ్యి.. 2 రామ ములక్కాయలతో కూర చేసాను. ఒక బుడ్డి గ్లాస్ బియ్యం వండుదామంటే ముందు నీళ్ళు తక్కువ పోసి తర్వాత నీళ్ళు ఎక్కువపోసి.. మొత్తానికి గంజి గంజిగా అన్నం వండుకుని.. ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి! చాలా రుచికరంగా వండాను! నేను వంట చెయ్యడానికి మొత్తం తీసుకున్న సమయం 15 నిమిషాలు! సీరియల్ టైం అయిపోతుంది మరి అప్పుడు!

Tuesday, June 1, 2010

నేను కూడా ఒక విషయం కనిపెట్టాను!

ధనుర్మాసం వైష్నవులకి చాల ముఖ్యం ఐన నెల. ఆ నెలలో సూర్యనమస్కారం చేస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్నువుకే నమస్కరించినట్టు అంటారు. నా స్నేహితురాలి వల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ధనుర్మాసం లో సూర్యుడు మూలా నక్షత్రంలో ఉంటాడు. మూలా నక్షత్రం ఎమో మన galaxy centreని చూస్తుంటుంది. అంతే విష్నుమూర్త్య్ని అనమాట! ఇక్కడి వరకూ బానె ఉంది. కాని మనం వైకుంట ఏకాదశి రోజు ఉత్తర ద్వారాన్ని ఎందుకు తెరుస్తాం గుడిలో? అక్కడ మొదలయ్యింది నా doubt. ఉత్తరానికి, తూర్పుకి ఎంటీ లింక్ అని. నిన్న రాత్రి అలా చల్ల గాలిలో ఆకాశాన్ని చూస్తు ఉన్నాను. చాలా రోజుల తర్వాత కొంచం clearsky కనిపించింది. ఫలానా నక్షత్రం, గ్రహం అని చూపిస్తూ నా ఫ్రెండ్స్ ని ఇంప్రెస్స్ చేసాను కూడా :P అలా scorpionని చూస్తూ ఉండగా వెలిగింది బల్బ్! మూలా నక్షత్రం తూర్పున కాదు.. సౌథ్-ఈస్టెర్న్ కొర్నెర్లో ఉంటుంది. అంటే మనం ఉత్తర ద్వారం తెరిచి చూసేది మాత్రం దక్షినాన్ని! అంటే మూల నక్షత్రాన్ని!! నా confusion తీరిపోయింది! భలే అనిపించింది నిన్న! నేను కూడా కనిపెట్టాను ఒక విషయం! ఇది నా Copyright!