Saturday, July 31, 2010

మా ఊరిలో రాములవారి కళ్యాణం!

పోయిన ఏడాది మా ఊరిలో కళ్యాణం pictures ఇవి! అందరు అంటుంటే ఎంటో అనుకునేదాన్ని.. కాని నిజంగా కనగ కనగ కమనీయమే.. వినగ వినగ రమణీయమే! మా నుజివీడు మామిడి బావుందా?

ఎదలో గానం.. పెదవే మౌనం..

అబ్బా.. ఎంత బావుందో ఈ రోజు అసలు... పర్లేదు.. ఎండగా కూడా ఉంది.. చక్కగా ఉంది.. అన్నిటికంటే ముఖ్యం నేను బావున్నాను!! చాలా బావున్నాను... ఆనందంగా ఉన్నాను!!!!! పొద్దున్నే గుడికి వెళ్ళాను.. మే బీ అందుకేనేమో బా అనిపిస్తోంది!!!
ఇంక కొన్ని రోజులుగా కట్టి కొట్టిన ఫ్రెండ్స్ తో సారి చెప్పేసి మళ్ళీ దోస్త్ అయిపోయాను! నిన్న చాలా హాపిగా వంట చేసాను.. చాలా బాగా చేసాను! మర్చేపోయాను... మొన్న ఆనంద్ కూడా చూసాను :D ఆనంద్ క్యూట్ కదా!
suddenga ఒకరోజు నిద్ర లేచేసరికి ప్రపంచంలో ఉన్న గడియారాలు, కాలెండెర్లు మాయం అయిపోతే మనకి అసలు టైం ఎలా తెలుస్తుంది? అప్పుడు నా దగ్గరకి వస్తారు అందరు.. హెల్ప్ కోసం.. ఎందుకంటే నా స్టార్స్ అలానే ఉంటాయి కదా.. నేను చెప్పెస్తా! :D కాని ఖర్చు అవ్తుంది :D 
ఇక కృష్ణుడు.. అస్సలు రాయట్లేదు కదా ఆయన గురించి!! రాసేది రాయించేది ఆయనే కదా! :D ఇలా సరిపెట్టుకోవాలి! ;)
నాకు నచ్చిన పాట... మీకు నచ్చితే వినండి!!

Miss You Anand! :D

Friday, July 30, 2010

ఈ గాలి, ఈ వాన, ఈ మబ్బు... ఈ ఊరు బెంగళూరు!

ఛి ఛి! అసలు ఇదేమన్నా న్యాయమా.. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. వారం నుంచి ఇలానే ఉంది.. చెత్త చెత్తగా.. చల్ల చల్లగా.. అసలు ఏదన్నా కొంచం బావుంది అని అంటే చాలు.. దాని extremes చూపించేస్తాడు కృష్ణా! అసలు బుద్ధి లేదు... ఇంకా ఏముంటుంది.. జలుబు,జ్వరం, తలనొప్పి.. ఒకటా రెండా.. మళ్ళి వీటికి తోడు.. పవర్ కట్.. ఏమిటో మళ్ళీ ఇదో మహానగరం!ఆహ్ ఈ రోజే పాపం కొంచం కనికరం కలిగి ఏదో ఒక మూల నుంచి సుర్యా రావుగారు కనిపిస్తున్నారు.. మా మీద దయ తలచి ఈ వీకెండ్ కొంచం వెచ్చగా ఉంటే బావుండు.. స్టార్స్ ని చూడక 10 రోజులు ఐంది.. :(

మర్చేపోయాను చెప్పడం.. Venus, Mars, Saturn ఈ వారం చాలా దగ్గరగా ఉంటాయండోయ్.. western skyని చూస్తూ ఉండండి!

Saturday, July 24, 2010

లూనార్ క్రేటర్స్!

మొత్తానికి నిన్న నేను నా టెలిస్కోప్తో చందమామ ని చూసేసాను! :) మా చెల్లికి చెప్తే స్వదేశ్ సినిమాలో ఉన్నట్టూ కనిపించిందా అని అడిగింది :D నా గురించి చాలా ఎక్కువాగా అనుకుంటుంది పిచ్చి చెల్లి..! ఫోకస్ చేసేసరికి చుక్కలు కనిపించాయి! కాని పర్లేదు నిన్న ఇక్కడ బానే మబ్బులు ఉన్నా కూడా, వాటి మధ్యలో నుంచి కనిపించాడు.. అంతే కాదు క్రేటర్స్ కూడా కనిపించాయి!!!

Friday, July 23, 2010

అందాల రాక్షసి!

ఆనంద్ లో రూప గురించి వేటూరి మాటల్లో! ఎవరికో ఇవి బాగా సరిపోతాయి! :P


అందంలో ఊర్వశి.. అయితేనేమి రాక్షసి..
అవుతుందో లేదో మరి ఈమే నా ప్రేయసి..
పుండుపై కారం చల్లీ.. పువ్వులా నవ్వుతుంది..
వెన్నెల్లో వేదిస్తుంది.. వేధించి చంపేస్తుంది!!

నా బ్లాగ్, వెనక కాఫీ, orange కలర్, ఆనంద్!

ముందుమాట: నా ఆనంద్ సినిమాని ఎక్కిరించే వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు :P

జూన్ 10, 2004: ఆనంద్ సినిమా audio రిలీస్ ఐంది! నేను అలా పడిపోయాను first clips చూసి! ఎందుకనుకున్నారు.. ఎక్కడ చూసినా 'orange' కలర్!! నాకేమో orange అంటే పిచ్చాయే! ఇక పాటల గురించి చెప్పనే అక్కర్లేదు! ఎంత బావున్నయో!

అంతే మరుసటి రోజునుంచి నా ఫ్రెండ్స్ ని చంపేసాను.. ఆనంద్ ఆనంద్ అంటూ.. మా క్లాస్లో అసలు ఎవరికి అలాంటి ఒక సినిమా రిలీస్ అవ్తుందని తెలియదు. నేనే ఎక్కువ publicity ఇచ్చి ఉంటాను అసలు ఆనంద్కి.. శేఖర్ కమ్ముల నాకు రుణపడి ఉన్నాడు :D.. ఆ సినిమా గురించి కాని.. director గురించి కాని.. ఎవ్వరి గురించి నాకు అక్షరం ముక్క తెలియదు! కాని ఆ సినిమా బావుంటుందని నా ఫీలింగ్! సిద్ధూని ఐతే రోజు హింసించేదాన్ని.. చూడూ చూడూ అని! ఫైనల్గా సినిమా రిలీస్ అయ్యాక నాకంటే ముందు నా ఫ్రెండ్స్ అందరూ చూసేసారు! ఇన్ని ఇయర్స్ కి కూడా ఆనంద్ నా favourite ఫిల్మ్! సినిమా చూసాక orange ఏ కాదు, కాఫీ ఉంది, ఒక మొండి పిల్ల ఉంది, 'ఆనంద్' ఉన్నాడు ;) (ఇంతకి నాకు ఇష్టమైన పేరులలో ఆనంద్ కూడా ఒకటి :D), ఇంకా చాలా చాలా కలిసి నాకు భలే నచ్చేసింది!

ఈ రోజు ఎందుకు రాస్తున్నా అంటే.. ఇక్కడ మాకు భలే చల్లగా ఉంది..  వేడి వేడిగా ఏమన్నా తింటూ.. మంచి కాఫీ తాగుతూ.. ఆనంద్ సినిమా చూస్తూ అలా హాయిగా జీవితం గడిపేస్తే బావుండనిపిస్తోంది!!! పగటి కలలు :-/

Thursday, July 22, 2010

తొలి ఏకాదశి.. నాకు అన్నీ డౌటులే!

Copyrighted material :D

నిన్న తొలి ఏకాదశి కదండీ! ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారంట! అసలు ఎందుకు ఈ ఏకాదశినే తొలి ఏకాదశి అనాలని నాకు అర్థం కాలేదు. సరే అని ఆలోచించడం మొదలుపెట్టాను. నాకు కొన్ని points తట్టాయి! ఇవి పూర్తిగా తప్పు కూడా అయ్యి ఉండవచ్చు!
1. దక్షిణాయనం మొదలయ్యాక మొదటి ఏకాదశి
2. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. దక్షిణాయనం ని అందుకే ఎంచుకున్నారు అనుకుంట! దక్షిణాయన సమయంలో సూర్యుడు ఉత్తరం  నుంచి దక్షిణానికి తన ప్రయాణం మొదలు పెడతాడు! అంటే ఆ సమయంలో దక్షిణం చీకటి అన మాట! ఇంతకు ముందే ఒక పోస్ట్లో చెప్పాను కదా... మన విష్ణుమూర్తి ఉండేది దక్షిణం వైపున అని. అందుకే ఆయన నిద్రపోతున్నారని.. శయన ఏకాదశి అన్నారు అనుకుంట!
3. ఇక తొలి ఏకాదశి రోజునే చతుర్మ్యాస వ్రతం కూడ మొదలవుతుంది. 4 నెలలపాటు వ్రతం  చేస్తారట. ఇది ఎందుకనో నాకు అంతగా అర్తం కాలేదు. 4 నెలలు అంటే కార్తీక మాసం మొదలు అవ్తుంది. దాని తర్వాత ఒక నెలరోజులకి వైకుంఠ ఏకాదశి! మనం కార్తీక మాసంలో దీపలు వెలిగిస్తాం. దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందేమో చూడాలి. వైకుంఠ ఏకాదశి రోజున మనకు తెలిసిందే కదా.. సూర్యుడు మూలా నక్షత్రంలో ఉదయిస్తాడు.. అంటే విష్ణుమూర్తి నిద్ర లేస్తారనమాట!

ఇంకా చూడాల్సిన విషయాలు చాలానే ఉన్నయి!
ఇవండి తొలి ఏకాదశి మీద ఈ రోజు నేను చేసిన రీసెర్చ్!

నేను, నా ఈగో!

ఈ పోస్ట్ ఎవరికో ఏదో చెప్పాలని రాయట్లేదు.. infact ఈ బ్లాగ్లో రాసేవన్ని నాకోసం రాసుకుంటున్నా!
ఈ రోజు నేను చేసిన ఒక పని నాకు నచ్చలేదు! లోపల ఏదో తొలిచేస్తున్నట్టు ఉంది.. ఒకరు ఏదో అంటే నేను దానికి కొంచం ఎక్కువగా రియాక్ట్ అయ్యాను!వారు అన్నది నాకు నచ్చినా నచ్చకపోయినా.. నేను పట్టించుకోవల్సిన అవసరం లేదు. కాని నాకు ఉన్న ఈగో కి నేను ఇంకోలా థింక్ చేసాను! ఇంకో మాట ఏంటంటే అసలు ఆ మనిషికి తెలియదు కూడా.. నేను రియాక్ట్ అయ్యాను అని! కాని నాకు తెలుసు! అది చాలు!

Wednesday, July 21, 2010

వారాలు.. అధిపతులు.. ఇప్పుడు అర్థమైంది!

నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది.. ఎందుకు ఒక్కో రోజుకి ఒక్కో అధిపతి ఉన్నారు అని? అసలు ఎలా చెప్పారు అధిపతుల గురించి అని? దాని వెనక రీసన్ అర్థం అవ్వలేదు అసలు. కాని 'ఆర్యభట్' దయవల్ల ఈ రోజుకి అర్థమైంది. 'ఆర్యభట్టియం' చదువుతుంటే తెలిసింది!!

 ఇదండీ వరుసగా గ్రహాలు వాటి వాటి స్పీడ్ ఆధారంగా.. ఒక రాశి దాటడానికి శనిగ్రహం సుమారు 2.5సం తీసుకుంటే, మూన్ 2.5 రోజులు తీసుకుంటాడు!
  Saturn, Jupiter, Mars, Sun, Venus, Mercury, Moon -- order of the planets!

 మన పెద్దవాళ్ళేం చేశారంటే, అందరికంటే మెల్లిగా శని తీరుగుతాడు కాబట్టి మొదటి రోజు ఆయనకి ఇచ్చారు. అంటే సూర్యుడు ఉదయించే అప్పుడు మొదటి గంట ఆయనది అనమాట.. తర్వాత గంట గురుడికి, అంగారకుడికి అలా ఇచ్చుకుంటూ వచ్చారు. మరునాడు సుర్యోదయం సమయానికి అంటే 24 గంటల తర్వాత (24%7 = 3 => Saturn+3 => Sun; లెక్క ప్రకారం ఆ గంట సూర్యుడిది అవ్తుంది) సూర్యుడిని అధిపతి చేసారు! ఈ లెక్క చేసుకుంటూ వెళ్తే మిగిలినవి అర్థమయిపోతాయి!

  శనివారం       -- Saturn/ శని
  ఆదివారం      -- Sun/ సూర్యుడు (శని+3)
  సోమవారం    -- Moon/ చంద్రుడు (సూర్యుడు+3)
  మంగళవారం --Mars/ అంగారకుడు (చంద్రుడు+3)
  బుధవారం     --Mercury/ బుధుడు (అంగారకుడు+3)
  గురువారం    --Jupiter/ గురుడు (బుధుడు+3)
  శుక్రవారం     -- Venus/ శుక్రుడు (గురుడు+3)
  శనివారం      -- Saturn/ శని    (శుక్రుడు+3)

  ఇలా రిపీట్ అవ్తుంది!

Tuesday, July 20, 2010

ఆవకాయ్ బిర్యాని!

సినిమాకి ఈ పోస్ట్ కి పెద్దగా సంబంధం లేదు! ఎలాను ఆ పేరు వాడుకున్నాను కాబట్టి.. "అదిగదిగో ఆశలు రేపుతూ", "వీరుడేన" ఈ రెండు పాటలు నాకు చాలా ఇష్టం.. మీకు నచ్చాలి అనే రూల్ లేదు.. వినండి బావుంటాయి! :D

ఇక విషయానికి వస్తే.. మీలో ఎంత మందికి భాగ్యనగరం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం! ఎందుకూ అంటే..
1. మా ఇల్లు అక్కడ ఉంది కాబట్టి
2. అమ్మ చేతి వంట తినొచ్చు కాబట్టి
3. ఎవరి మీద అంటే వాళ్ళ మీద గయ్యాళి ల పడిపోవచ్చు కబట్టి.. బాగా గొడవపడొచ్చు... గెలవొచ్చు కూడ!
4. అక్కడ బిందు ఉంది కాబట్టి
5. అస్సలు మొడెర్న్ గా ఉండదు కాబట్టి.. పిచ్చి పిచ్చి గా.. పాత పాతగా.. రియల్గా ఉంటుంది కాబట్టి
6. హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కాబట్టి
7. ఇక్కడి కంటే మంచి స్కై చూడొచ్చు కాబట్టి
8. విజయవాడ కి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు కాబట్టి
9. ఎందుకంటే అక్కడ అందరు కలిసి ఉంటారు కాబట్టి

నాకు ఇప్పుడు హైదరాబాద్ కావాలి! :(
మరి మీకేవూరు ఇష్టం?

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా!

కృష్ణుడు అన్నారు: " మీ దగ్గర ఉన్న ఇంత అమూల్యమైన సమయాన్ని ఎందుకు నిద్రపోతు వృధా చేసుకుంటున్నారు"
నేను: అదేంటి స్వామి అలా అనేసారు.. బయట చల్లగా ఉంది.. ట్రైన్లో నిద్రలేదు.. ఈ రోజుకి లేట్గా లేవొచ్చు.. అది పాపం కాదు.
కృష్ణ: లేస్తున్నావా లేదా బుజ్జి!!!!
నేను టక్కున లేచేసాను.. :( టైం చూస్తే 5.30 ఐంది. ఇదేమన్నా న్యాయమా నీకు కృష్ణ?
కాని ఈ కల ద్వారా నాకేమన్న చెప్ప తలచుకున్నాడా ఏంటి ఈయన? :-?  

Monday, July 19, 2010

ఒక ఆలోచన!

నిన్న నాకు ఒక డౌట్ వచ్చింది. బ్రహ్మయే ప్లానెట్ వాసి అయ్యి ఉంటాడా అని? మనకి ఎంత దూరంలో ఉండి ఉంటాడా సుమారుగా అని? అతనికి ఒక రోజు ఎంతో మనకి తెలుసు.. సంవత్సరం ఎంతో మనకి తెలుసు.. మరి అతను మనకి
ఎంత దూరంలో ఉన్నాడో చెప్పలేమా? లెక్కలు వెయ్యాలి :D

బ్రహ్మ అనే వాడు ఉంటే అతను ఇంత దూరంలో ఉంటాడు అని నా లెక్క చెప్పింది... ఇది పూర్తిగా తప్పు కూడా అయ్యి ఉండొచ్చు!


R(A.U) = P(years)2/3




320423239.14357356472074095267296

320423.239 trillion

33871 ly


33871 lightyears anta andi!!!
ఈ దూరంలో ఒక ప్లానెట్ ఉందండోయ్!!! :D


Thursday, July 15, 2010

నిన్నటి పాఠం !

చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన కాలక్షేపం ఆకాశాన్ని చూడటం! దానివల్ల నాకు నక్షత్రాల పేర్లు తెలియకపోయినా, ఆకాశం చాల familiarగా ఉండేది. ఇప్పుడైతే వాటి పుట్టు పూర్వోత్తరాలు చెప్తాను! కాని ఇక్కడ నేను ఒక విషయం ఎప్పుడూ మర్చిపోతాను. నన్ను ఆకాశం చూపించమని అడిగిన వాళ్ళకి చూపించడానికి ట్రై చేస్తాను.. కాని వాళ్ళకి చాలా సార్లు కనిపించవు. చెప్తాను కొద్ది రోజులు చూస్తు ఉండండి స్కై అని.. కాని నిన్న తెలిసింది వాళ్ళకి ఎలా ఉంటుందో.. నా కొత్త టెలిస్కొప్లో ఒక్క స్టార్ కి బదులు అక్కడ 100 స్టార్స్ కనిపించాయి!!! ఏమీ అర్థం కాలేదు అసలు... అదో కొత్త ప్రపంచం కనిపించింది!
             ".. యునివెర్స్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యుచర్ ఒకటేసారి చూసినట్టు :D"
చాలా కష్టంగా అనిపించింది. నేను చూసే ప్రపంచం వాళ్ళు చూసే ప్రపంచంలో తేడా కనిపించింది! నాకు చాలా ఈజి అనిపించింది వాళ్ళకి చాలా కష్టంగా అనిపించేది! నిన్న నా టెలిస్కోప్ పుణ్యమా అని వాళ్ళు నాకు అర్థం అయ్యారు!
కొత్త విషయం నేర్పించాలి అంటే, టీచర్ స్టుడెంట్ ప్లేస్లో ఉండి నేర్పించాలి.. అప్పుడు కాని.. పిక్చర్ క్లియర్గా ఉండదు!
Galileo Zindabad! :D

కవి(పి)త్వం!

ఆకాశాన తారలొక్క పోలిక నుండు|
చూడ చూడ వాటి రంగులు వేరయ||
కొత్త టెలిస్కోప్ తో నా పాట్లు ఇంతింత కాదయ|
విశ్వదాభిరామ వినుర వేమ||

Wednesday, July 14, 2010

ఇంటెరెస్టింగ్!

నా ఎడమ చేతి వేళ్ళ కింద నరాలు Heart షేప్లో ఉంటాయి!! మరి మీవి?

'Dreams come true, when you believe in them!'

నా విషయంలో.. నాకంటే ఎక్కువగా నా ఫ్రెండ్స్ కి నమ్మకం ఉంది నా కలల మీద! వాళ్ళు నాకు పంపిన పుట్టినరొజు గిఫ్ట్ చూసాక ఏం చెప్పాలో అర్థంకాలేదు. It's a Telescope, ఇంకా Harry's wonderful world!

Tuesday, July 13, 2010

వరదలా వచ్చే నీ ప్రశ్నలకి.. నాకు తోచిన సమాధానాలు!

బుజ్జమ్మా,

1.అరే మరుక్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా.. లేనిదాని గురించి ఆలోచించడం ఎందుకు అనుకుంటే, అసలు  మనిషి కలలు కనడం మానేస్తాడు కదా! మన ఈ జీవితాన్ని చాలా అందంగా చేసేవి కలలే కదా.. ఆశ ఉండాలి, కలలు కనాలి, కష్టపడాలి.. ఇవి అన్ని ఉండికూడా తనని, తనవాళ్ళని మర్చిపోకూడదు!
2.అసలు దేనిని ఐనా మార్చాలి అని ఎందుకు అనుకోవడం? అసలు ఏదైనా నువ్వు మార్చగలవు అంటే అది కేవలం నిన్నే! మార్పు నీలో మొదలవుతుంది బంగారం!!
3.నిజమో మాయో అది నీ మైండ్లోనే ఉంటుంది.. నువ్వు ఏం చూడాలి అనుకుంటున్నావో నీకు అదే కనిపిస్తుంది..మరి నీ చేతిలో ఉన్నప్పుడు.. నీకేం చెయ్యాలో కూడా తెలిసే ఉంటుంది!!
4.ఇక నువ్వేమిటి అంటే.. నువ్వు నేనే, నేను నువ్వే, నువ్వూ నేనూ అందరమే! ఇది అర్థం చేసుకుంటే అసలు ప్రొబ్లెంసే ఉండవు మరి!
5.నీకు నచ్చినట్టు సాగితేనే అది నీ లైఫ్!!! Thats what makes life so adventurous and so beautiful! Good Luck!

Monday, July 12, 2010

డియర్ బుజ్జి,

మరుక్షణం ఎలా ఉంటుందో తెలియనప్పుడు, చిన్న చిన్న వాటికి ఆలోచించి బాధపడడం చాలా సిల్లీగా ఉంది కదా? లేదా ఇది మానవ నైజం అంటావా?
ఏదీ శాశ్వతం కానప్పుడు.. ప్రతి దానిపై మమకారం పెంచుకోవడం అవసరమంటావా?
నీ చేతిలో లేనివాటిని మార్చాలనుకోవడం సాధ్యపడుతుందని ఇంకా నమ్ముతున్నావా?
నువ్వు చూసేదీ చేసేది.. నిజమా? మాయా? ఇప్పటికైనా తెలిసిందంటావా?
"నేనేమిటి? నేనేందుకిలా?" చిన్నప్పటి నుంచి నిన్ను కుదిపేస్తున్న ప్రశ్నకి ఇప్పటికైనా సమాధానం దొరికిందంటావా?
జీవితం అనే నా ఈ నావలో నాకు వచ్చినట్టు, నచ్చినట్టు సాగుతున్న నాకు ఎప్పటికైనా సమాధానం దక్కుతుందంటావా?
ఈ జన్మ కాకపొతే మరు జన్మకైనా! ( మరుజన్మ అసలు ఉంటుందంటావా? ఉంటే నాకు ఎలా తెలుస్తుందీ?? నాకు ఎప్పుడూ అర్థంకాలేదు! )

సత్య గీత!

మన జీవితంలోకి వచ్చే ప్రతివారు మనకి ఎదో నేర్పించడానికో లేదా మననుంచి ఎదో నేర్చుకోవడానికో వస్తారట! నాకైతే అందరూ నేర్పించడానికే వచ్చారు నా లైఫ్లో కి! నిన్న మా గురువుగారు (సత్య) మనుష్యుల స్వభావం గురించి చెప్తూ అన్నారూ.. మనకోసం ఎదుటివారు చేసినవి మనం ఎంత త్వరగా మర్చిపోతాం కదా.. మనకి నచ్చని పని ఒక్కటి చేస్తే చాలు.. కోపం తెచ్చేసుకుంటాం.. అన్ని రోజుల నుంచి ఉన్న మంచి అంతా ఒక్కసారిగా మంటకలిపేస్తాం కదా అని.. ఆవిడ చెప్తూ ఉంటే నా గురించి విన్నట్టు అనిపించింది!!  

Thursday, July 8, 2010

అభిజీత్!

 Yes! నిన్న నేనే గెలిచాను.. వేగ కనిపించింది.. 25ఇయర్స్ వెనక్కి వెళ్ళి చూసాను యునివెర్స్ని! I'm so happy!    

Wednesday, July 7, 2010

ఈ సంవత్సరం ఏం నేర్పించింది..

పాతిక సంవత్సరాలు... ఇప్పటికే ఎన్నో నేర్పించి ఉంటుంది జీవితం! కాని నిన్న మరి ఇంకొంచం స్పెషల్ కద! ఒంట్లో బాలేదు.. వర్షం పడింది.. చికాకు చికాకు! కాని మనం పట్టు వదలని వాళ్ళం కదా.. 11 నుంచి వెయిట్ చేసాను.. వేగా కనిపిస్తుందేమో ఏదన్నా మూల నుంచి అని.. అబ్బే ఎక్కడ! చిన్నిగా జల్లు పడుతూనే ఉంది.. అందరు పడుకునిపోయారు.. ఒక్కదానినే.. కొంచం సేపు భగవద్గీత చదివాను.. డైరీ రాసాను.. కాని ఇంక బోలెడు టైం ఉంది.. వేగ వేగ అని చూసాను.. కాని రాలేదు వేగ!

నిన్నటి స్పెషల్స్ ఇవి!

1. నిన్న చిరు జల్లులు కురిశాయి! హెవెన్స్ నుంచి బ్లెస్సింగ్స్!!
2. స్టార్స్ కాకపోతే clouds! నిన్న నాకు బుద్ధా కనిపించారు మేఘాలలో! So full happy!
3. ఎవరితోను ఎక్కువగా అట్టాచ్ అవ్వకూడదు... నేను చాలా క్లోస్ అనుకున్న వాళ్ళు కాల్ చెయ్యకపొవడం కొంత బాధకలిగించింది!
4. As usual కృష్ణుడు ఎప్పుడూ పక్కనే ఉన్నారు!

నాకు నచ్చిన విధంగా చల్లగాలిలో, వానలో కేక్ కట్ చేపించి.. నన్ను చాలా surprise చేసిన నా roomiesకి థాంక్స్!!!

పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జమ్మ!

Sunday, July 4, 2010

కలలు కలలు కలలు! :D

అబ్బా.. నిన్న మళ్ళీ కలలు.. కొన్ని డొక్కులో డొక్కు ఐతే ఒకటి మాత్రం సూపర్! నేను కలలో scorpionని చూసాను.. దానితో పాటు అసలు sagittarius ఇంకేదో ఆకారంలో కనిపించింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే.. aquarius కనిపించింది.. అది కూడా వంద రేకులు ఉన్న అందమైన పువ్వులా.. అది కూడా చాల ఎక్కువ మెరిసిపొతూ ఎదో వజ్రంలా ఉంది.. వోవ్!

యోగా క్లాస్ అయ్యింది వేదాంతం క్లాస్!

కుంద మిస్ గురించి ఎప్పుడూ చెప్పలేదు ఇక్కడ.. ఆవిడ నాకు యోగ నేర్పిస్తారు.. నా గురువు! వేద పండితురాలు ఆవిడ! నూటికో కోటికో ఉంటారు ఆవిడలా.. నేను ఇంతకు మునుపు అలా ఎవరిని చూడలేదు! ఎలాంటి ప్రశ్నలు అడిగిన .. ఎంతో ఓపికతో చెప్తారు.. నా అదృష్టం ఆవిడ గురువు అవ్వడం.. సత్య మీకు చాలా థాంక్స్!

Friday, July 2, 2010

నా మ్యాజికల్ థియరి!


నాకు క్రేజి ఆలోచనలు చాలా ఎక్కువ.. ఇప్పుడు రాయబోతున్నది దానికి ఉదాహరణ! సరే .. అలాంటివి రెండు రాస్తాను.. ఒక దానితో ఇంకోటి ఫ్రీ :D   

1. అప్పుడెప్పుడో ఒకసారి రాశాను.. మనం ఒక పెద్ద గ్రహం చుట్టూ తిరుగుతుంటే ఎలా ఉంటుంది అని? నిన్న సాయంత్రం కార్లో నుంచి చూస్తే మళ్ళీ అదే అనిపించింది.. ఇప్పుడు నేను ఎప్పుడు ఆకాశం చూసినా.. నేల మీద నుంచుని 'Empire State Building' చూసినట్టు అనిపిస్తుంది.. :D
ఇంతకి ఏంటంటే.. ఆ పేద్ద గ్రహం చుట్టూ మనం ఒక రోజులో తిరిగేస్తున్నం అంటా.. ఆ గ్రహం ఎంత పెద్దది అంటే.. మనకి అన్ని వైపుల అదే కనిపిస్తుంది అంట.. మరి రాత్రేమో చుక్కలు కనిపిస్తాయి కదా.. అవేమో అక్కడ వాళ్ళు లైట్లు వేసేసారు అంట! హ హ హ!! అసలు ఎంత పిచ్చి థియరి కదా... నాకు తెలుసు... కాని ఇలా ఆలోచించి ఆకాశాన్ని చూస్తే మ్యాజికల్గా అనిపించింది!  

ఇక రెండొవది.. ఇది మాత్రం నా Copyrighted Material! :D :D :D

ఇది లైఫ్, యునివెర్సె అండ్ ఎవ్రిథింగ్ గురించి...     

యునివెర్సె ఎలా ఎక్స్పాండ్ అవ్తుంది అని.. ఇది నా థియరి.. 

మన యునివెర్సె కి బయట ఇంకా చాలా యునివెర్సెస్ ఉన్నాయి అని కొంతమంది వాదన.. అంటే సముద్రంలో ఒక చిన్న నీటి బుడగ లాంటిది అంట మన యునివెర్సె.. అలాంటివి ఎన్నో అంట! ఐతే మరి ఆ నీటి బుడగ అంత చిన్న దాంట్లో మన సొలర్ సిస్టెం ఎంత చిన్నగా ఉండాలి మరీ? అందులో మళ్ళీ మనం!!! :-o ఇక విషాయానికి వస్తే.. ఇప్పటివరకూ మన మనుగడ గురించి, విశ్వం ఆవిర్భవించిన విధానం గురించి.. చాలా థియరీలు వచ్చాయి.. ప్రతి ఒక్కటి materialistic గా ఉంటాయి.. ప్రతిదాని limitation..mathematics,speed of light etc etc., ఇప్పుడు నా థియరి.. ఇందులో నేను ఇవేమి పెద్దగా వాడట్లేదు.. నా థియరి మన దగ్గర నుంచి మొదలవుతుంది.. నేను ఎలా ముందుకి వెళ్తున్నాను అని.. ఇది నా simplest equation for creation:
   
      (sum of all positive energies) - (sum of all negative energies) = Delta ----- (1) 
  
  when Delta > 0 ; My life is progressive!
  When Delta < 0 ; Not so good! :D
  
  Delta < 0 అయిన వెంటనే... అది మళ్ళీ equilibrium state కి రావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది.. ఒక చిన్న తుఫాను నా లైఫ్లో అనుకోండి... ఇది జగత్తులో ఒక చిన్ని ప్రాణి కి equation.
  నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే.. ఇదే equation యునివెర్సె కి కూడా valid అవ్వొచు కదా! యునివెర్సెలో ఉన్న ప్రతిది ఆ equationlo భాగమేమో! మన దగ్గర ఉన్న ఒక constraint .. speed!speed of light ని రీచ్ అవ్వలేమేమో అని! కాని మనం ఒక చోట physicalga ఉంటే కాని ఏమి చెయ్యలేమా? I dnt think so.. నేను ఇక్కడే ఉండి Arcturus గురించి ఆలోచించడం వల్ల.. Arcturusని effect చేస్తున్నానేమో! something similar to Telepathy! నాకు తెలిసి nature మనని మిల్లిఒన్స్ ఒఫ్ light years travel చెయ్యమనదు.. అక్కడికి వెళ్లకుండా కూడా.. you can make a difference! ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరం, ప్రతి planet, ప్రతి star, ప్రతి dead star.. ప్రతిది యునివెర్సె creationlo, expansion lo participate చేస్తున్నాం.. equation(1) holds very well to the universe also :D :D 
  
  ఇక్కడ రాసిన ప్రతిది completega వ్రొంగ్ అయ్యి ఉండొచ్చు.. కాని నాకు interestingగా అనిపించింది నా ఆలోచన!    

Thursday, July 1, 2010

నాకు నచ్చిన హీరోలు!

1. ఆనంద్ (ఆనంద్)
2. ఎడ్వర్డ్ (ట్విలైట్)
3. కరణ్ (హం తుం)
4. హోవర్డ్ రోర్క్ (The Fountainhead)
5. సుజల్ గరేవాల్ (కహీన్ తో హోగ)
6. చంద్రశేఖర్ (స్వర్ణ కమలం)

మరి మీకో?? హీరో కాకపోతే హీరోయిన్ :P

కోపం, ఏడుపు..

అబ్బా నిన్న అంత చెప్పానా.. సాయంత్రనికి దాని పరీక్ష పెట్టేసాడు దేవుడు! నాన్న మీద చాల కోపం వచ్చేసింది.. ఏదో విషయం నా దగ్గర దాచారని.. కొంచం గట్టిగా మాట్లాడేసాను.. తర్వాత ఏడ్చేసాను! నాకు అస్సలు నచ్చలేదు నేను ఏడవటం.. ఎందుకు నాకు ఎడుపు వచ్చింది.. బాడ్ గర్ల్!