1. మంచి స్కూల్ లో Ph.D admission
2. 1000$ ఫండింగ్ ప్రతినెలా :D
3. అలస్కా ట్రిప్ !!!!!
నాకోసం మీరు కూడా దేవుడిని ప్రార్థించండి please ! :D
Sunday, August 29, 2010
చందమామా చందమామా.. కిందకి చూడమ్మా!
ఎలా ఉన్నరండీ... అంతా కుశలమేనా? ముచ్చట్లు మరి తగ్గాయి బుజ్జాయికి.. ఏం చేస్తుంది పాపం.. కష్టాలు.. తప్పవు! ఎప్పుడూ ఉండేవే కాని.. ఈ మధ్య కాలంలో చందమామని చూసారా ఎవరైనా? మాకు కొంచం క్లియర్ స్కై ఉండటం ఎప్పుడో చేసుకున్న పుణ్య ఫలితం అనుకోవాల్సిందే.. ఛి ఛి.. ఎప్పుడు చూసినా మబ్బులు.. వానా.. ఏదో నా మీద దయతలచి మొన్న.. మా ఊరి మబ్బులు వేరే ఊరెళ్ళిపోయాయి :D అప్పుడు కనిపించాడండీ.. సినిమాల్లో చూసే చంద్రుడు.. ఎంత బావున్నాడనుకున్నారు? అంత తెల్లగా ఎలా ఉన్నాడో ఏమో అసలు.. ఇది వరకు నాకు నచ్చిన చంద్రుడు చైత్ర మాసంలో వచ్చాడు.. yellowishగా ఉన్నాడు.. అప్పుడు దక్షిణం దిశగా ఉన్నాడు.. నిన్నేమో ఉత్తరం.. హహ.. నాకు extremes ఇష్టమనుకుంటాను :P ఇంకో చిత్రం ఏంటంటే ఒకటే మెరుపులు.. చందమామ కి కూడా నేను నచ్చేసాను అనుకుంటా.. నా ఫొటో తీసుకున్నాడు :D
మరో మాట.. ఈ వారంలో కన్నయ్య పుట్టినరోజు కూడా ఉంది!! :)
మరో మాట.. ఈ వారంలో కన్నయ్య పుట్టినరోజు కూడా ఉంది!! :)
Monday, August 16, 2010
కన్నయ్య చెప్పేవి ఒక్కటీ నేను వినను! :-o
కన్నయ్య టీచర్ రోల్లో ఉన్నప్పుడూ చాలానే చెప్తారు.. చాలాసార్లు ఆయన చెప్పేవి కష్టంగానే ఉంటాయి.. కాని ఆయన గురించి చెప్పుకుంటారు ఒక పాఠంలో.. నాకు అది చాలా ఇష్టం.. ఎందుకంటే అన్నిట తను ఉన్నాను అని చెప్తారు.. భలే నచ్చింది నాకు అది.. తనే వెలుగట! తనే ఆనందమట! తనే ఉత్తరాయణమట! బానే ఉంది ఇదంతా.. తాను చీకటి కాదట!! తాను దక్షిణాయణం కాదట!! ఇది నేను అస్సలు ఒప్పుకోలేదు..
ఎందుకు ఒప్పుకోవాలట! రాత్రి నాకు చాలా ఇష్టం కద ( నేను రాక్షస జాతా? :-o).. నాకు మరి దక్షిణాయణం కూడా ఇష్టమే! రాత్రేమో హాయిగా ఆకాశాన్ని చూస్తూ.. ఏ చీకూ చింతా లేకుండా.. ఆ పని ఈ పని చెయ్యాలన్న దిగులు లేకుండా.. ప్రతి దానికి టైం చూడాల్సిన అవసరం లేకుండా.. తినాల్సిన అవసరం లేకుండా.. ఆహా ఎంత బావుంటుంది.. ఇవన్ని ఒక పక్కన ఐతే.. అసలు ఆకాశం ఎంత బావుంటుంది.. ఎన్ని స్టార్స్.. మనకు నచ్చినట్టు మారతాయి! నచ్చినట్టు కథలు చెప్పొచు.. మ్యాజికల్గా ఉంటుంది.. కాని ఆయనేమో నేను కాదు ఇది అంటారు.. నేను ఒప్పుకోను.. నేను చూస్తున్నదే నిన్నే కన్నయ్య... ఆ చుక్కల్లో కూడా.. నిన్ను అర్థం చేసుకోవాలనే నా ప్రయత్నం అది.. నేను గొప్ప యోగిని కాకపోవచ్చు.. కాని ఒంటరిగా నేను అర్థరాత్రి చుక్కల్ని చూస్తున్నప్పుడు.. ఎక్కడో ఏదో ఒక ఫీలింగ్.. ఆ ప్రశాంతతలో నాకు నేను ఇంకొంచం అర్థం అవ్తున్నానని.. లోకం అర్థమవుతోందని.. నువ్వు కనిపిస్తున్నావని..

Sunday, August 15, 2010
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు!
మా సిరి నవ్వు కూడా అంతే బావుంటుంది!! వచ్చేయి తొర్గ తొర్గా :D
ఇప్పుడు వింటున్న పాట! నా కన్నయ్య!
ఇప్పుడు వింటున్న పాట! నా కన్నయ్య!
Friday, August 13, 2010
ఓ మనిషి ఇది నీకే!
అందం అంటే రూపంలో ఉంటుందనుకున్నా!
నీ మాట విన్నాక నా ఉద్దేశం మార్చుకున్నా!
నీ నవ్వులో ఉంది అందం.. నీ కోపంలో ఉంది అందం!
ఇంకా ఆపుతావా? అంటే మాత్రం నాకు మహానందం :D
నువ్వు స్టార్స్ గురించి చెప్తే నాకు బోర్ కొడుతుంది..
టాపిచ్ ఏదైనా నీ మాట కోసమైనా వినాలనిపిస్తుంది!
కాగితంపైన నువ్వు గీసిన చిన్ని కృష్ణుడి బొమ్మ నాకు ఇంకా గుర్తు ఉంది..
నువ్వు కూడా అంతే క్యూట్గా ఉంటావని నా మనసు చెప్తోంది!!!
తెలివైన అమ్మయిలని చాలామందినే చూసాను.. తెలుగుతనం ఉన్న అమ్మయిని నీలోనే చూసాను :D
అదృష్టం ఏవి చేస్తే తగులుతుందో నాకు తెలియదు.. ఈ Luckyని కలిసాక నాకు బుజ్జి అదృష్టం దొరికిందని అభిలాషిస్తున్నాను!!!
ఫ్.శ్.: ఒక సహజ కవి మాటలు ఇవి.. :D

అలసితీ... సొలసితీ
బాబోయ్.. అసలు ఆఫీస్లో ఇంత పని నేనెప్పుడూ చెయ్యలేదు బాబు... ఇన్ని రోజులు చిన్నపిల్ల కదా అని వదిలేసారు అంట నన్ను... ఇంక కాదు.. రెండేళ్ళు ఐంది.. పనిచెయ్ అనేసారు.. ఏం చేస్తాం.. చెయ్యక చస్తామా? :( పడుతూ లేస్తూ.. ఏడుస్తూ.. ఏదో ఈ రోజుకి మంగళం పాడించేసాను బాబు!
ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారూ??
ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారూ??
Monday, August 9, 2010
అమావాస్య చంద్రుడు!
సాదారణంగా అందరికీ వెన్నెల చాలా నచ్చుతుంది.. వెన్నెల మీద చాలా కవితలు కూడా రాస్తారు... అందంగా ఉంటుందట.. అందమైన ఆడపిల్ల మనసులా స్వచ్చంగ :D
కాని ఏమో బాబు.. నాకు వెన్నెల అంత మంచి ఫ్రెండ్ కాదు మరి.. ఆవిడ నాకంటే అందంగా ఉంటుందని ఈర్ష్యేమో :ఫ్ ఆవిడగారు వస్తే చాలు నా ఫ్రెండ్స్ అందరు డిం అయిపోతారు.. సరిగ్గా కనిపించరు పాపం.. ఆవిడకి ఎవరు ఇచ్చారట ఆ హక్కు?? ఏది ఏమైనా నాకు ఇప్పుడు ఆ గొడవ గురించి మట్లాడాలని లేదు.. నాకు నచ్చే అమావాస్య చంద్రుడి గురించి ఇది..
అమావాస్య కి ఒక 4-5 రోజుల ముందు నుంచి ఎవరన్నా చంద్రుడిని చూస్తే నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది.. అసలు అర్థరాత్రుళ్ళు లేచి నక్షత్రాలని చూడటమే చాలా బావుంటుంది... అప్పుడు చంద్రుడు కూడా మరి నక్షత్రంలానే ఉంటాడుగా! చాలా అందంగా ఉంటాడు... shadowedగా అనిపిస్తాడు.. నల్లని చంద్రుడు బావుంటాడు.. నా కన్నయ్యా లాగా! ఈ సారి మీరు కూడా ట్రై చెయ్యండి..

Wednesday, August 4, 2010
ఆడించి అష్టా చమ్మా..ఓడించావమ్మా!
అష్టా చమ్మా ఒక్కటేనా ఏంటి? ఏ గేమైనా అలా ఓడించేస్తుంది మా బిందు! కాకపోతే దాని రూల్స్ కొంచం చిత్రం .. విచిత్రం! అది ఏ గేం ఆడినా అదే గెలవాలి! ఇంకో దారిలేదు.. ఒకవేళ మీరు తెలివి ప్రదర్శించాలి అనుకుంటే.. ఏముంది.. దాని బుర్రలో నుంచి మీ పేరు shift+Del చేస్తాను అని బెదిరిస్తుంది! మరి అంతా క్యూట్ పాపతో గొడవ ఇష్టంలేక ఓడిపోవడమే మేలు అని నిర్ణయానికి వచ్చేస్తాం! మీలో చాలామందే చెస్స్ ఆడతారేమో! కాని ఎవ్వరు మా బిందు ముందు గెలవలేరు.. ఈ సారి ఇంకొన్ని రూల్స్ చేరాతాయి! పావులు తనకి నచ్చినట్టు వెళ్ళాలి.. రాజు భటుడైన రోజులు కూడా ఉన్నాయి.. నీ దగ్గర నాకంటే ఒకడు ఎక్కువ ఉన్నాడు.. నీ పావును చంపాలి! ఇది దాని చెస్స్!!
ఇక నిన్నటికి నిన్న.. ఫోన్ చేసి.. నేను ఎలా మట్లాదితే నువ్వు అలా మాట్లాడాలి అంది.. అప్పుడే అనుకున్న... ఏదో తేడా అని
బిందు: నేనూ
నేను: నేనూ
బిందు: కుక్కనీ
నేను: ???
బిందు: అనూఉ
నేను: ఏమనాలి
బిందు: నేను కుక్కనీ
నేను: నేను బుజ్జి ని
బిందు: నీ నంబర్ డిలీట్ చెయ్యాలా?
నేను: :( :'(
బిందు: అంటున్నావా లేదా?
నేను: నేను కుక్కనీ :(
బిందు: అయ్యా నువ్వు కుక్కవా? హహహహ!
నేను: :'(
Monday, August 2, 2010
కృష్ణ... నిన్ను మిస్సింగ్! :(
నాకు చాలా చికాకుగా ఉన్నప్పుడు.. నా కృష్ణుడు నాకు చెప్పిన మాటలు..
"బుజ్జమ్మా.. చికాకుగా ఉండటం వల్ల నీకేమన్నా వస్తుందా?లేదా నీకు నచ్చినట్టుగా పరిస్థితులు మారిపోతాయా అలా ఉంటే? నన్నెందుకు గుర్తుచేసుకోవు బాధగా ఉంటే.. ఎవరు లేరు అని ఎందుకు అనుకుంటావ్.. నీ కృష్ణ ఎప్పుడూ నీతోనే ఉంటాడు బంగారు.. నీకు తోడుగా.. నీకు చాలాసార్లు చెప్పాను.. మళ్ళీ చెప్తాను.. ఏది జరిగిన నీ మంచికి జరుగుతోంది.. నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా ఉందేమో.. నీ చేతిలో లేనివాటి గురించి ఆలోచించకు.. ఆనందంగా ఉండు.. నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నీలో ఉండే నేను ఆనందంగా ఉంటాను.. కాబట్టి బంగారు తల్లీ నాకోసం నవ్వేయ్యి ఒకసారి.. నీ కృష్ణుడి కోసం.. నా గారాల కుట్టి.. :) "
కృష్ణా ఎక్కడ ఉన్నావ్.. నాకు బాధగా ఉన్నప్పుడు ఎందుకు నీ మాట వినిపించదు నాకు?

కలయా.. నిజమా -2
నాకు కొన్ని నెలల క్రితం ఒక ఇంటెరెస్టింగ్ కల వచ్చింది.. అందులో నేను దక్షినం దిశగా Jupiter,Venus ఇంకా mercury ని చూసాను.. ఒక triangle ఆకారంలో.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిన్న venus, mars, saturn అచ్చం అలాగే ఉన్నాయి.. అదే ఆకారంలో.. అదే చోట!! :-o
Sunday, August 1, 2010
When You smile for me.. World seems alright!
నా లైఫ్లో ముఖ్యమైన వాళ్ళు.. నా బెస్ట్ ఫ్రెండ్స్ (సిరి, ఇంక కొంతమంది చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా మిస్సింగ్ ఇందులో)!!!
Happy Friendship Day everyone! :)
Happy Friendship Day everyone! :)
Subscribe to:
Posts (Atom)