Wednesday, September 29, 2010

నా బ్లాగ్కి ముఖ్య అతిధి! :D

ఏది ఏమైన నేను ఇలా ఒక బ్లాగ్ రాస్తానని మా ఇంట్లో ఎప్పటికి తెలియకూడదు అని మొదటి పోస్ట్ రాసినప్పుడు అనుకున్నాను! నా పప్పులేవి అక్కడ ఉడకవు కాబట్టి.. అలానే నేను రాసేవి చదివితే మా అమ్మ నన్ను ఎప్పుడు మళ్ళి స్టార్స్ ని చూడనివ్వదు కాబట్టి.. మా నాన్న ఎలాను చూడమన్నా చూడరనుకోండి :ఫ్ కాని ద్రోహి నాకు ఇంట్లోనే మా చెల్లి రూపంలో ఉందని తెలియలేదు :D  అమ్మ కి చూపించడమే కాకుండా.. మొత్తం బ్లాగ్ చదివించేసింది x-( ఏదో మా తాతగారి వల్ల బ్రతికిపోయాను కానీ..లేకపోతే ఇంకేమన్నా ఉందా... ఎందుకే అలా టైం వేస్ట్ చేసుకుంటావ్ చుక్కలు అవి ఇవి అంటూ.. రెస్ట్ తీసుకోవచ్చు కదా.. లేదా చదువుకోవచ్చు కదా అంటుంది మా అమ్మ.. ఈ పెద్దోళ్ళున్నారే!

Thursday, September 16, 2010

ఏదో చిన్న ఆలోచన!

ఆకాశాన్నీ చూసినప్పుడల్లా నాకు చాలా చిత్రమైన ఆలోచనలు వస్తాయి! ఈ సారి చిత్రమైనదేమీ కాదు కానీ.. ఇంకో దృష్టితో చూడటం అంతే.. మనం (అంటే ఇక్కడ భూమి) నడుస్తూ వెళ్తున్నాం అంట.. దారిలో చాలా మంది ( నక్షత్రాలు ) ఎదురొస్తారంట.. అలానే సుర్యుడూ అనే పెద్ద స్టార్ కూడా.. మనం అసలు నడక ఆపమట.. వెళ్తూనే ఉంటామంట.. అలుపే లేకుండా... ఇలా చూస్తే పగలు కి రేయి కి మీకేమన్నా తేడా కనిపిస్తోందా? జీవితం కూడా అంతేనేమో.. ఏది జరిగినా.. ఏది ఎదురు వచ్చినా.. నచ్చినా నచ్చకపోయినా.. ఎక్కడా ఆగదు కదా!

Friday, September 3, 2010

Too Many reasons to Celebrate

అబ్బ! ఎన్నో రోజులు అయినట్టుగా ఉంది ఇక్కడ రాసి!! ఏం చేసాను ఇన్ని రోజులు మరి.. బద్దకం.. ఇంకా కొంచం బిజీగా ఉండటం :D

బావున్నాను ఈ రోజు.. చాలా ఆనందంగా ఉన్నాను! ఎందుకంటే

1. నేను 'Star Gazing' క్లాసెస్ తీసుకోబోతున్నాను.. విడ్డూరం ఏంటంటే టీచర్ రెడీ.. ఇంకా స్టూడెంట్స్ లేరు :D

2. నేనేంటో నాకు ఇంకా బాగా తెలియాలనేమో కొత్త పాఠాలు నేర్పిస్తున్నాడు.. నాలోని కృష్ణుడు!

3. మొత్తం మీద నిద్ర తగ్గించుకున్నాను! ఇప్పుడు 6 గంటలే!

4. కాఫీ!

5. మంచి ఫ్రెండ్స్!!

6. నాకోసం ఎప్పుడూ ఉండే ఆకాశం!

మొన్న గీత క్లాస్లో సత్య నాకు కరన్యాసం నేర్పిస్తూ చెప్పిన మాటలు చాలా నచ్చాయి!

ఆ మంత్రాలు చెప్తూ మనం మనలోని దేవుడికే పూజిస్తామని!!!

శ్రీకృష్ణ పరమాత్మా దేవతా!
శ్రీకృష్ణ ఎవరో కాదట.. మన ఆత్మేనట.. ఆ ఆత్మే దేవతట!

కృష్ణార్పణం!

Wednesday, September 1, 2010

కన్నయ్య 25వ పుట్టినరోజు!!!


25 ఏంటా అనుకుంటున్నారా?? నేను పుట్టి అన్నే సంవత్సరాలు ఐంది మరి :D
మా ఇంట్లో పుట్టినరోజు వేడుకలు!