Friday, October 29, 2010

చిత్రమైన కల!

ఇప్పుడు ఇక్కడ నేను నా కల గురించి చెప్పను కానీ.. కలలో ఒక చిత్రమైన విషయం జరిగింది. Foldable LCDs విన్నాను కాని... కలలో నా దగ్గర ఉన్న laptop screen ఎలా అంటే అలా fold చేసెయ్యొచ్చు! :-o

Thursday, October 28, 2010

స్నేహం !

జీవితంలో చాలా మందిని కలుస్తూ ఉంటాం. ఒక్కొక్కరూ ఒక్కో రకం. నాకు పరిచయం అయిన చాలా మందిలో ఒకటి మాత్రం కామన్. ఎక్కువ మంచితనం నా పట్ల! కొంచం కష్టంగా అనిపించేది అప్పుడప్పుడు.. ఏదో తెలియని భారం.. వాళ్ళ మంచితనం ముందు నేను తేలిపోతానేమోనని! దూరం చేసాను.. నా మంచి ఫ్రెండ్స్ ని.. ఆ మంచితనం భరించలేక..స్వార్థపరురాలని కద! దూరంగా ఉండి మేమందరం కలిసి నవ్వుకున్న రోజులు గుర్తుచేసుకుంటాను ఇప్పుడు అంతే... రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. కాని ఆ జ్ఞాపకాలు అలానే ఉన్నాయి.. వాళ్ళు అందరు ఇంకా అలానే ఉన్నారు.. ఎప్పుడూ నాకు తోడుగా.. అంతే ప్రేమగా!
అలాంటి ఒక ఫ్రెండ్ తో నిన్న మట్లాడాను.. నా బెస్ట్ ఫ్రెండ్తో.. ఆ గొంతులో బాధ విన్నాను.. నేను మాట్లాడకుండా పెట్టిన బాధ! ఎంత క్రూరురాలిని కదా అనిపించింది! కాని తను అస్సలు ఏమి అనలేదు.. మాట తీరూ మారలేదు.. అదే ఆప్యాయత! "నువ్వు ఆనందంగా ఉండు.. నీకు నచ్చింది చెయ్యి.. మాకు అది చాలు!" తను చెప్పిన మాటలు..
అలా ఎలా ఉంటారు అనిపించింది.. ఎన్ని రోజులు గడిచినా.. ఎన్ని గాయాలు అయ్యినా.. ఎంత బాధపెట్టిన... ఆ ఆప్యాయత అస్సలు తగ్గకుండా.. స్నేహం అంటే ఇలానే ఉంటుందా? అలా ఐతే నేను ప్రపంచంలో అందరికంటే లక్కి గర్ల్ ని!

Monday, October 18, 2010

ఊహాలోకమా?

కానే కాదు.. నా కృష్నుడు, నా స్టార్స్... అవి ఊహ ఎలా అవుతాయి! అవి ఊహలైతే అసలు నేను ఉన్నానా? అవే నేను కద!

ఒక బృందావనం.. సోయగం!

వచ్చేసానండి మొత్తానికి! విశేషాలేంటంటే.. బృందావనం చూసాను సకుటుంభ సపరివార సమేతంగా! ఇది కొంచం విశేషమే మరి.. పదేళ్ళయ్యింది! అందరం కలిసి హాయిగా అలా గడచిపోయాయి మూడు రోజులూ! మా బిందు నేను అందరికంటే ఎక్కువ ఆడుకున్నాం. ఎంచక్క మేము రాళ్ళతో fire చెయ్యటానికి ప్రయత్నించాం! :P ఇంకా చాలా పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకున్నాం (ఆడాల్సి వచ్చింది :D) కలిసి మగధీర చూసాం! దసరాలు దీపవళిలు ఎందుకండీ? అందరం కలిసి ఆనందంగా ఉన్న ప్రతీ రోజు పండుగే కదా!

మిస్సింగ్ home! మిస్సింగ్ Chinnu!