జీవితం చాలా అనూహ్యంగా మలుపులు తిరుగుతుంది.. నిజమే.. ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది.. మరుక్షణం ఎలా ఉంటుందో చెప్పలేం.. కానీ జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటాం.. గాలి మేడలు చాలానే కట్టేస్తాం. కొన్ని మేడలు కూలిపోతాయి.. కొన్ని మేడలు రూపుదిద్దుకుంటాయి.. మరెన్నో మేడలు జీవితంలో ఆశను మిగుల్చుతాయి. కొన్ని నిరాశను మిగుల్చుతాయి. దేనిని ముందుకు తీసుకుని వెళ్ళాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఇక జీవితం లేదు అని నేను అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు తలచుకుంటే నేనేనా అలా అనుకున్నది అనిపిస్తూ ఉంటుంది.. కాని అనుకున్నాను.. అలా అనుకున్న వాళ్ళ మీద నాకు తక్కువ అభిప్రాయం లేదు ఈ రోజు.. ఎందుకంటే ఆ పరిస్థితి అలానే ఉంటుంది. కానీ దానిని అధిగమించి ముందుకు వచ్చిన వాళ్ళు చాల మంది ఉన్నారు.. రానివారు ఉన్నారు.. కానీ వీరిలో ఎవరికోసము లోకం ఆగలేదు.. నాకోసం కూడా ఆగలేదు.. అన్ని యథాతథం గా సాగుతూనే ఉన్నాయి.. కొద్ది రోజులు నేను లోకంతో సాగలేదు అంతే..
అనుసరించనప్పుడు ఏ పాఠం అయినా ఎన్ని సార్లు చదివి ఏమి ప్రయోజనం.. భగవద్గీత ఎన్నో సార్లు చదివాను.. కాని అవసరమైన సమయంలో ఒక్కసారి కూడా వాడలేదు నేను.. కానీ నేను మళ్లీ పాజిటివ్గా ఆలోచించడానికి మాత్రం చాలా తోడ్పదిందనే చెప్పగలను.. తెలుసుకోవాల్సిన పాఠం తెలుసుకోవాల్సిన రోజుల తప్పకుండ తెలుస్తుంది.. ఏ రెండు జీవితాలు ఒకటి కాదు.. కానీ తెలివిగల వారు ఎదుటి వారు చేసిన తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళిపోతారు..
నేను చాలా సార్లు ఓడిపోయాను.. చాలా సార్లు నిరుత్సాహ పడ్డాను.. కానీ జీవితం లో ఏదో ప్రయత్నించాను.. నా జీవితం నాకు ఈ రోజు వరకు బోర్ కొట్టలేదు.. కోల్పోయాను పోగొట్టుకున్నాను అనే బాద లేదు.. ఎదురు దెబ్బలు చాలా తగిలాయి.. కానీ ఎన్నో దెబ్బలు తింటే కాని ఆ వంశి కృష్ణుడి చెంతకు చేరలేదుగా! నేను అంతే..
Always have the same optimism!
ReplyDelete