Thursday, May 19, 2011

మాయా శశిరేఖ!

మాయాబజార్లో NTR, SVR ఒక రేంజ్ అయితే.. అబ్బా అసలు మయా శశిరేఖగా సావిత్రి సూపర్! తన పెళ్ళికి తనే పాట పాడేసుకుంటూ.. తిప్పలు తనకి కాదు వచ్చే వాడికి అని చెప్తూ.. ఆహ.. అమ్మాయి అంటే అలా ఉండాలి.. :D

మాయాబజార్ పిచ్చి ముదిరిపోయి.. పెళ్లి చూపుల్లో నేను అబ్బాయికి మాయాబజార్ క్విజ్ పెట్టాలని నేను సత్య డిసైడ్ కూడా చేసాం :D టెస్ట్ లో పాస్ అయినవాడే అర్హుడి కింద.. modern స్వయంవరం :D

అసలు ఈ రోజు మాయా శశిరేఖ ఎందుకు వచ్చిందంటే.. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఏవో పెళ్లి చూపులు జరిగాయట.. ఎం జరిగింది అంటే.. రెండు రౌండ్స్ టెక్నికల్ ఒక రౌండ్ HR అని చెప్పుకుని వచ్చింది పాపం.. ఆ అమ్మాయి చెప్పే విధానం చూస్తే హహహ నాకెందుకో శశిరేఖ గుర్తుకు వచ్చింది... 

అందమైన.. తెలివైన ఆడపిల్లల్లారా.. మీకే ఈ పాట.. కొంచం నేర్చుకోండి.. గయ్యాళి తనమే అందం :D

2 comments:

  1. మాయాబజార్ క్విజ్, మాడర్న్ శశిరేఖా, పెళ్ళి చూపులకి టెక్నిచల్, హృ రవుండ్లూ - బాగుంది!
    మరి పాటలింకు మరిచిన మా సీతమ్మనేమనాలి?

    ReplyDelete
  2. పెళ్ళి చూపులకి వచ్చే ముందు అబ్బాయిల అవస్థలు ఎపుడూ వినలేదా? స్వీయ అనుభవం లేక ఇంతకాలం దీని మీద టపా వేయలేదు కానీ నా స్నేహితుల పాట్లు నాకు తెలుసు. First impression is best అన్నారని పాపం అద్దం ముందు పడే పాట్లు. ఏమీ అడగకపోతే పరువుపోతుంది అని ప్రాక్టీసు చేసే ప్రశ్నలు. టెన్షన్ కి చెమట్లు పట్టి, గొంతు విప్పటానికే వణుకుతారు. గడుసైన అమ్మాయిలయితే ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ ఏంటి మొదటిసారా అని సెటైర్లు కూడా వేస్తారు.

    ReplyDelete