Monday, May 30, 2011

మరణానికో ప్రేమ లేఖ నే రాయలేనా??


జీవితానికి  ప్రేమ  లేఖ  రాయాలని  మొదలు  పెట్టి  ఎవరో  మరణానికి  ప్రేమ  లేఖ  రాసేసారు .. కానీ  idea నచ్చింది  నాకు .. జీవితం  కంటే  మరణం  గొప్పదా ? అంటే  ప్రేమలేఖ  రాసే  అంత  గొప్పదా  ani?

గొప్పదే  అనిపించింది ..

మార్పు ని  తెస్తూ .. కొత్తదనాన్ని  పంచుతూ .. బహుశా  మరణం  మనకి  తెలియకుండానే  మన  జీవితంలో  భాగమేమో .. or may be మరణమనే  ఒక  పెద్ద  సెట్  లో  జీవితమే  ఒక  చిన్ని  subset ఏమో !

మరణం  అనే  word ఎందుకు  ఈ  రోజు  ఇంత  మధురంగా  అనిపిస్తోంది ?

తలచుకుంటేనే  ఏదో  ప్రశాంతత .. రుద్ర  భూమి  పైన  ప్రేమ .. బూడిదతో  ఏదో  అనుబంధం ..

మరణం  నువ్వు  చాలా తెలిసిన  వాడిలా  అనిపిస్తున్నావు ..

నీకోసం  ఎదురు  చూస్తూ  నేను  గడిపాలి  ఒక  జీవిత  కాలం .. నిన్ను  చేరాలనే  ఆశతో.. నవ్వుతు  ఏడుస్తూ .. నాలో  నిన్ను  శోధిస్తూ.. ఒకరోజు  నిన్ను చేరుకుంటాను  ప్రియతమా ..

అమావాస్య  చంద్రుడిలా  నువ్వు .. కంటికి  కనపడక .. కవ్విస్తూ .. ఊరిస్తూ .. గడియలు .. రోజులుగా .. గంటలుగా .. నా  జీవితంగా  మారి .. నీకై  ప్రయాణం  చేస్తున్నాయి ..

దక్షిణా మూర్తిగా    నువ్వు .. నీ  ఉత్తరాముఖిగా  నేను .. ఎన్నాళ్ళింకా  నీ  ధ్యానంలో ... దిక్కులు  కలిసే  వేళ.. నీ  కౌగిలిలో  చేరి  అనంతంలో  కలిసిపోవాలనే  కోరిక ..

నిన్ను  నన్ను  దూరంగా  ఉంచుతున్న  ఈ  జీవితం  నాకు  శత్రువు .. నా  జీవితాన్ని  కరిగించి .. నీ  జీవితాన  వెలుగుగా  మారాలనే  తపన ..

1 comments:

  1. Its a crazy ఐడియా, writing Love letter to death.
    great to imagine like loving death.

    "may be మరణమనే ఒక పెద్ద సెట్ లో జీవితమే ఒక చిన్ని subset ఏమో ! " - > బాగుంది మీ ఊహ. అవును. మనకు మన కర్మ ఫలితం పూర్తయ్యే వరకు జన్మలు ఉంటూనే ఉంటాయి అంటారు కదా. ఈ జీవితాలు అన్ని subset లు అయి ఉండొచ్చు.

    ReplyDelete