Tuesday, August 9, 2011

సంధ్యారాగం

శ్రావణ సంధ్య వేళ వెలుగుని హరించి చీకటి కమ్ముకుంటుంటే, అస్తమ సమయం కొత్త ఆశలు రేపుతోంది.. 
మరి కాసేపట్లో చీకటి కమ్ముకుంటుందని.. మన లోకం తిరిగి వస్తుందని.. నువ్వు వస్తావని..
లోకమంతా అంధకారంగా భావిస్తుంది నిన్ను.. నువ్వే నా లోకంగా జీవిస్తున్న నేను..
నిన్నే ధ్యానిస్తూ.. నీలో నన్ను శోధిస్తూ.. నిన్ను కలిసే ప్రయత్నంలో అనుకోకుండా దారిలో నన్ను నేనే కలుస్తున్నాను.. 
జీవిత పరమార్థం తెలిపే యోగివి నువ్వు.. 
వెలుగురేకలు వచ్చి చీకట్లు కమ్ముతుంటే.. నువ్వు వచ్చి జీవితంలోని అంధకారాన్ని తొలగించావు.. నా జీవితంలో వెలుగునిచ్చావు.. నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నావు..
ఊపిరి పీల్చుకోవడమే జీవించడమా ? కాలంతో పాటు పరుగేత్తడమేనా బ్రతకడం అంటే? 
నీ ఉనికి తెలిపింది జీవితంలోని మాధుర్యం.. నీ ధ్యానంలో గడపడటమే నా జీవితం..
నా ప్రియుడివి నువ్వు..  మృత్యువువి నువ్వు..
నీకై ఎదురు చూసే నీ ప్రియసఖిని నేను ..

3 comments:

  1. ఇంతకీ ఈ ప్రేమలేఖ ఎవరికి? లేబుల్‌లో indicate చేసినట్లు హరునకా?

    "లోకమంతా అంధకారంగా భావిస్తుంది నిన్ను."

    తిమిరమునకా?

    "మృత్యువువి నువ్వు.."

    మరణమునకా?

    లేక
    వెలుగురేకలు చిమ్మే చీకట్లను పటాపంచలు చేయు విజ్ఞానమునకా?

    ReplyDelete
  2. priyuni chethilo..maranam koodaa varame.. anduke.. priyudivu neeve..Mruthyuvuvi nuvve..!! very nice expression.

    ReplyDelete