Monday, August 22, 2011

శభాష్ ఇండియా!

సంవత్సరం క్రితం, తెలంగాణా ఆందోలణకారులు హైదరాబాద్లో విధ్వంసం సృష్టించారు.. తెలంగాణా కావాలంటూ. ఎటు చూసినా పగిలిన గాజు పెంకులు, తగలపడిన బస్సులు. భయమేసింది ఎక్కడ ఉంటున్నాం అని.. ఎటెళ్తున్నామని.
ఈ రోజు లక్ష మంది ర్యాలీ చేస్తూ కూడా.. ఎక్కడా ఎటువంటి గొడవా లేకుండా.. వారు చెప్పాలనుకున్నదీ, చాటాలనుకుంటున్నది.. సౌమ్యంగా, అహింసాపూర్వకంగా చెప్తూ.. హౌరా !ఇది మన భారతమేనా అనేలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వైనం నిజంగా అభినందనీయం.
అన్నా హజారేను సపోర్ట్ చేస్తున్నారు అనటం కంటే.. ఒక 'కాజ్' ని సపోర్ట్ చేస్తున్నారు అనటం కరెక్ట్ ఏమో..
అప్పటికీ ఇప్పటికీ ఉన్నా తేడా ఒక్కటే.. ఒక సమర్ధవంతుడైన నాయకుడు..
మన దేశం ప్రపంచంలో అగ్రగామి అవ్వాలంటే ఇలాంటి నేతలు ఎందరో కావాలి.. కాని ఈ రోజు భారతావనిని చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది.
జై హింద్!

పరిత్రాణాయ సధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్ధాయా సంభవామి యుగే యుగే

"యే కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధినొందునో, ఆయా సమయములయందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సమ్రక్షణముల కొరకు ప్రతీ యుగమున అవతారము దాల్చుచున్నాను"

3 comments:

  1. సపోర్ట్‌చెయ్యడం, కలిసి పోరాడటం బాగానే వున్నాయండి కానీ ఆ స్ఫూర్తిని దైనందినజీవితాల్లో ఎంతవరకూ ఆచరణలోపెడతారన్నదానిమీదే ఏదైనా ఉద్యమమ్యొక్క్క్క విజయం ఆధారపడుంటుంది కదా.

    ReplyDelete
  2. "అన్నా హజారేను సపోర్ట్ చేస్తున్నారు అనటం కంటే.. ఒక 'కాజ్' ని సపోర్ట్ చేస్తున్నారు అనటం కరెక్ట్ ఏమో.."
    బాగా చెప్పారు సీత గారు.. ఈ ఉద్యమం కోట్లాది ప్రజల మనోభావాల్ని ప్రతిఫలిస్తుంది.. అందుకే జై అన్నా హజారే..

    ReplyDelete