Monday, February 28, 2011

నీ స్నేహం నేర్పించిన్దేమిటి..?

ప్రపంచంలో ప్రతిది మంచిదేనని.. ఏ భావం ఏ తలపు చెడు కాదని.. ప్రతిదానిలో మంచి ఉంటుందని.. ఏది అసహ్యిన్చుకోతగినది కాదని.. మొదటిసారి తప్పు ఒప్పు అనే తేడా చూపించలేదు నా ఆలోచనలలో..
మొదటిసారి.. అన్నీ కరెక్ట్ అనిపించాయి..
ఈ రోజు నువ్వు లేవు..  అయినా ఇప్పటికి అన్ని సరిగ్గానే అనిపిస్తున్నాయి.. అనిపిస్తూనే ఉంటాయి అనుకుంట..
నీ స్నేహం నాకు లోకం ఎలా ఉంటుందో చెప్పలేదు.. నాలో ఉండే లోకం ఎలా ఉంటుందో చూపించింది.. మనిషిని చూపించింది.. మనిషి ఆలోచనలలో మునిగాక తేలడం నేర్పించింది...
నీ స్నేహం నన్ను నేను ఇంకొంచం మెరుగ్గా అర్థం చేసుకునేలా చేసింది..
నువ్వు ఇక లేవు అనే ఆలోచన కన్నా.. నాలో నిన్ను చూసుకోవడం మెరుగ్గా అనిపిస్తోంది..బహుశా నిన్ను నేను ఎప్పటికీ మిస్ అవ్వను..

Monday, February 21, 2011

బాధ .. ఎంత బాధగా ఉంటుంది?

చాలా బాధగా ఉంటుంది.. చెప్పలేనంత.. చూపించలేనంత..
ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే.. అబ్బ ఇక ఈ బ్రెయిన్ పనిచేయకపోతే బావుండు కదా.. అసలు ఆలోచనలు లేకుండా ఉంటే బావుండు కదా అనే అంతగా.. 
బ్రెయిన్ అని అనేసాను.. అది బ్రెయిన్ కి సంబందిన్చినదా మనసుకు సంబందిన్చినదా? 
అవి రెండు వేరు వేరా.. లేదా ఒకటేనా? ఏమో నేను నాకు నచ్చినప్పుడు వాటిని ఒకటిలాగాను.. నచ్చనప్పుడు విడివిడిగానూ చూస్తాను..
బాదలో ఉన్నప్పుడు హ్యాపీ గా బ్రెయిన్ మీదకి పాడేస్తున్నాను మొత్తం.. emotions అన్ని బ్రెయిన్ కి సంబందించినవి అయితే బ్రెయిన్ లో ఒక స్టేట్ మెషిన్ ఉండి ఉండాలి కదా! ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి జుంప్ అవ్తూ ఉండటం.. ఎంత frequent గా చేంజ్ అవుతాం అన్నది అంతా ఫ్లో చార్ట్ లో ఉండి ఉండాలేమో.. 
మనిషిని మనిషిల కాకుండా మెషిన్ లా ఆలోచిస్తోంది ఈ పిల్లా అని అనుకుంటున్నారేమో.. నన్ను నేను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను..
ఎందుకంటే ఇది బ్రెయిన్ కి కాకుండా మనసు కి సంబంధించి ఉంటే.. అసలు నేను బాధపదేదనిని కాదేమో.. ఎందుకంటే distinguish  చెయ్యడం మనసుకి రాదనీ నా ఉద్దేశం.. అందరిని అన్నిటిని ఒకేలా చూస్తానేమో.. 
ఈ ఆనందాలు బాధలు మంచి చెడు లు.. ఇవన్ని ఈ పిచ్చి బ్రెయిన్ లో జరిగే పిచ్చి పిచ్చి ఎలెక్ట్రో-కెమికాల్  reactions ..
అందుకే నో బ్రెయిన్ స్టేట్ బావుంటుంది అని నా ఉద్దేశం.. blissful గా ఉంటుంది..

Sunday, February 20, 2011

కృష్ణతత్వం -౨ !

జీవితం చాలా అనూహ్యంగా మలుపులు తిరుగుతుంది.. నిజమే.. ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది.. మరుక్షణం ఎలా ఉంటుందో చెప్పలేం.. కానీ జీవితంపై  ఎన్నో ఆశలు పెట్టుకుంటాం.. గాలి మేడలు చాలానే కట్టేస్తాం. కొన్ని మేడలు కూలిపోతాయి.. కొన్ని మేడలు రూపుదిద్దుకుంటాయి.. మరెన్నో మేడలు జీవితంలో ఆశను మిగుల్చుతాయి. కొన్ని నిరాశను మిగుల్చుతాయి. దేనిని ముందుకు తీసుకుని వెళ్ళాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఇక జీవితం లేదు అని నేను అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు తలచుకుంటే నేనేనా అలా అనుకున్నది అనిపిస్తూ ఉంటుంది.. కాని అనుకున్నాను.. అలా అనుకున్న వాళ్ళ మీద నాకు తక్కువ అభిప్రాయం లేదు ఈ రోజు.. ఎందుకంటే ఆ పరిస్థితి అలానే ఉంటుంది. కానీ దానిని అధిగమించి ముందుకు వచ్చిన వాళ్ళు చాల మంది ఉన్నారు.. రానివారు ఉన్నారు.. కానీ వీరిలో ఎవరికోసము లోకం ఆగలేదు.. నాకోసం కూడా ఆగలేదు.. అన్ని యథాతథం గా సాగుతూనే ఉన్నాయి.. కొద్ది రోజులు నేను లోకంతో సాగలేదు అంతే.. 
అనుసరించనప్పుడు ఏ పాఠం అయినా ఎన్ని సార్లు చదివి ఏమి ప్రయోజనం.. భగవద్గీత ఎన్నో సార్లు చదివాను.. కాని అవసరమైన సమయంలో ఒక్కసారి కూడా వాడలేదు నేను.. కానీ నేను మళ్లీ పాజిటివ్గా ఆలోచించడానికి మాత్రం చాలా తోడ్పదిందనే చెప్పగలను.. తెలుసుకోవాల్సిన పాఠం తెలుసుకోవాల్సిన రోజుల తప్పకుండ తెలుస్తుంది.. ఏ రెండు జీవితాలు ఒకటి కాదు.. కానీ తెలివిగల వారు ఎదుటి వారు చేసిన తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళిపోతారు.. 

నేను చాలా సార్లు ఓడిపోయాను.. చాలా సార్లు నిరుత్సాహ పడ్డాను.. కానీ జీవితం లో ఏదో ప్రయత్నించాను.. నా జీవితం నాకు ఈ రోజు వరకు బోర్ కొట్టలేదు.. కోల్పోయాను పోగొట్టుకున్నాను అనే బాద లేదు.. ఎదురు దెబ్బలు చాలా తగిలాయి.. కానీ ఎన్నో దెబ్బలు తింటే కాని ఆ వంశి కృష్ణుడి చెంతకు చేరలేదుగా! నేను అంతే..

Saturday, February 19, 2011

కృష్ణతత్వం -1 !

సీ : కృష్ణుడిని వెతకాలి.. అదే నా జీవిత లక్ష్యం 
ప : సరే వెతుకుదాం.. వీకెండ్ వెతుకుదాం సరేనా. ఇప్పుడు ఆఫీసు లో పని చేసుకో
సీ : మరి వీకెండ్ వచ్చేసింది. కృష్ణుడు ఏడి?
ప : బుజ్జి, కృష్ణుడు నీకు నిజంగా ఎదురైనా రోజున నీకు నచ్చకపోవచ్చు. కాని కృష్ణుడిని వెతికే ఈ ప్రయాణం  ఉంది చూసావా.. అది మాత్రం చాలా బావుంటుంది. ఎంజాయ్ చెయ్యి ఈ టైం ని..

To Mam, with Love! బుజ్జక్కా నీకోసం !

నేను చదువుకునే రోజుల్లో నాకు సమయం కుదిరినప్పుడు మా ఎదురింటి అమ్మాయికి సరదాగా మాథ్స్ చెప్పేదాన్ని.. నిన్న ఆ అమ్మాయి నాకు క్రింది  మెయిల్ పంపించింది.. నాకు నచ్చింది.. మీతో షేర్ చేస్తున్నాను.. ఇంగ్లీష్ లో ఉంది.. మన్నించగలరు..

To begin on a light note…..
U taught me maths
Which I couldn’t even spell

I considered 70% a great achievement
But now I am a 94%
Because of u

Most important is the confidence u gave me
Which helped me get there
And also the self belief
Which was unfamiliar to me

There were loads of times
When I got 15s or 16s frm 25
But u taught me that
Crying over it was like accepting defeat

I never felt u were giving me tuitions
Instead, they were intellectual, interactive
Enlightening, funtertainment,
And also occasionally academic sessions

U r the 2nd best teacher
In my life
The 1st being my
Mom and dad

U taught me that happiness
Comes with small things and
And also to not expect things frm someone
But to expect frm oneself

U taught me to be carefree
But within the limit
U brought fun into my life
Which I am now addicted to
(I swear I ate pani puri for the 1st tym in ur house)

U were my best frend, my teacher
My guide, my inspiration
And I firmly believe
That u will forever remain so
I thank my stars, my fate
Or whatever and also
My mom
For I met u at the right time

Last but not the least
I jus want to say
THANK YOU
For everything

Wednesday, February 16, 2011

నేను, రూప!


ఈ బ్లాగ్ రాయడం మొదలుపెట్టినప్పుడు ఇందులో అన్ని మంచి విషయాలే రాయాలి అని అనుకున్నాను. నాకోసం రాయాలి అనుకున్నాను. నేను డల్గా ఉనప్పుడు ఇటు వచ్చి చూస్తే ఆనందంగా ఉండే సీత కనిపించాలని అనుకున్నాను. అలానే రాసాను..
చాలా ఎక్కువగానే  న్యాయం చేసేసాను :D
ఇటు వచ్చి చూస్తే బాధపడే అంత న్యాయం చేశాను.. అసలు ఈ అమ్మాయి నేనేనా అనే అంతగా :)
అందుకే ఇంత కాలంగా దూరంగా ఉన్నాను..
అందుకే ఇక ఆ పిచ్చి పిల్లకి సెలవు చెప్పేసి ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే ఈ సీతామహాలక్ష్మి దగ్గరకి వచ్చేసాను.. :)
ఎక్కడో సంతలో తప్పిపోయిన నన్ను నేను తిరిగి పట్టుకోవడానికి ఇంత సమయం పట్టింది మరి..
ఎదురుదెబ్బలు తగిలాయి మరి.. వాటినే పాఠాలు అనుకుని ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను..
ఆనందంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాను.. నా ఆనంద్ లాగా.. :D
అనందమాయేటి మనసు కథ మళ్ళి మొదలయ్యింది.. ఈ సారి ఇక ప్రతిసారి నాకోసం నేను!