Tuesday, March 29, 2011

పుస్తకాలూ - ప్రేమ !

కృష్ణుడు పెద్దగా పరిచయం లేకముందే ఈ ప్రేమ ఉండేది :D
పుస్తకాల ఫిలోసోఫి నాకు నచ్చుతుందండి.. అదేంటంటే " What others think about you is none of your business" :ద మనమేమనుకున్తున్నమో.. అసలు మనమేవరమో కూడా పట్టించుకోకుండా.. తను చెప్పాలనుకున్నవి చెప్పి వదిలేస్తుంది. 
నాకు బుక్స్ నచ్చడానికి ఒక కారణం అంటూ ఏమి లేదండి.. బుక్ తను చెప్పాలనుకున్నది నాకు నచ్చితే ఫ్రెండ్స్ చేసుకుంటాను. లేకపోతే పక్కన పెట్టేస్తాను. కానీ చాల వరకు బుక్స్ మనని వెతుక్కుంటూ వస్తాయేమో! నాకు అన్నీ నచ్చేస్తాయి.. 
బుక్స్ చదివితే జీవితంలో ప్రొబ్లెంస్ కి సోలుషన్స్ వస్తాయి అని కాదు కాని.. నాకైతే చాలా peaceful గ ఉంటుంది. ఆనందంగా ఉంటుంది.. నాకు ఉన్న కోపాలు చిరాకులు అన్ని తగ్గుతాయి. 
నన్ను చాలా మంది హేళన చేసారు.. పుస్తకాలు ఎక్కువ చదివే వాళ్ళు practical గా ఉండలేరని.. 
Anyway, What others think about me is none of my business :D

Friday, March 25, 2011

బానిసత్వం :-/

ఒకరు ఇమ్పోస్ చేసింది కాదు... మాకు మేము ఇచ్చుకున్నది అనుకుంటా.. మజోరిటి ఆడవాళ్ళల్లో చూసినది.. 
ఎవరో వస్తారు.. చాలా బాగా చూసుకుంటారు/ చూసుకోవాలి.. అబ్బా!! 
ఏంటో నా ఫ్రెండ్ కి పెళ్లి ఫిక్స్ అయితే ఎన్నిసార్లు అనుకున్నానో.. ఆ అబ్బాయి మంచి వాడో కాదో.. బాగా చూసుకుంటాడో లేదో అని.. ఒకరు ఎందుకు చూసుకోవాలి మమల్ని.. independent independent అని రాగం పాడటం కానీ.. మళ్ళి ఏంటో అలా చిన్నపిల్లలు అయిపోయి.. ఒకరు చూసుకోవాలి అని ఆలోచిస్తాం.. పిచ్చి!
ఏమి తెలియని అమ్మైలు అలా అనుకోవడం చూసాను.. చాలా తెలిసిన అమ్మైలు అలా మాట్లాడటం విన్నాను.. ఆఖరికి ఆ కాంటాక్ట్ నోవెల్ లో ఎల్లీ కూడా అలా మాట్లాడితే షాక్ తిన్నాను.. 
అబ్బా నేను ఒక లక్ష సార్లు అలా అనుకున్నాను.. కొన్ని సార్లు నా గురించి .. చాలా సార్లు నా ఫ్రెండ్స్ గురించి నా చెల్లి గురించి... ఛి ఛి ఛి ..

అసలు మార్పు ఎప్పుడు వస్తుంది ఆలోచనలలో.. ఎన్ని తరాలు ఇంకా ఇలానే ??

Wednesday, March 23, 2011

పావనం ప్రియం!

కొండవీటి న్యూటన్ హెల్ప్ లేకుండానే వాడి గత జన్మ రహస్యాలు తెలుసుకున్న ధీరుడు! (వీడు గ్రీక్ వారియర్ అని వీడి ఫీలింగ్ :D )

ఎవరు లేకపోతే వాడి కంపెనీ కి ఒక్క క్షణం కూడా ఎం చెయ్యాలో పాలుపోదో!
ఎవరి పేరు చెప్తే ఏలూరు ప్రజలందరూ జే జే లు కొడుతారో!
ఎవరి కోసమైతే రాజావి ఎదురు చూస్తున్నాడో!
ఎవరైతే ఆల్రెడీ ౪/౮ కోర్ మొబైల్స్ చూసేసాడో! 
ఎవరైతే అసలు మంచితనానికి స్టాంప్ఓ !

అతనేనండి ఈ కోతికి మారుపేరు! నా బెస్ట్ ఫ్రెండ్ !!
 
 

కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం!

తొమ్మిది సంవత్సరాల స్నేహం గురించి రాయాలనిపిస్తోంది ఈ రోజు.. 
ఒకే మంచం ఒకే కంచం టైపు ఫ్రెండ్స్ కాకపోయినా.. అన్ని సిమిలర్ గా జరిగాయి మా జీవితాలలో ..
అందరికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.. కానీ అందరం అంతే స్వీట్గా ఉన్నాం ఇంకా :D
తినగా తినగా వేప తియ్యగా అయ్యిందండి! 
ఇందు రూపంలో ఒక మిరకేల్ మా ముందు ఉంటే .. సిరి రూపం లో ఒక ఏంజెల్.. 
వంశి లా ఒక వర్కహోలిక్ .. సిద్ధూలా ఒక సూపర్ కూల్ మైండ్! 
అదితిలా మంచి ఫిలోసోఫేర్ .. నాలాగా ఒక స్వీట్ హార్ట్ ! :D
లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ప్రతి ఒక్కరం జీవితం(లో)తో ఎన్నో పోరాటాలు చేసాం..
ఇప్పటికి మొత్తానికి అందరి లైఫ్ ఒక కొలిక్కి వచ్చినట్టుంది.. 
సిద్ధూకీ, వంశీకీ వారి మనసుకి నచ్చిన జాబ్స్!
ఇందుకి బ్యూటిఫుల్ లైఫ్!
అదితి గురించి చెప్పలేను :P
సిరికి, నాకు సూపర్ శాంతి !!!
నేను చాలా హ్యాపీగా ఉన్నాను! నా లైఫ్లో బెస్ట్ మనుషులకి ఫైనల్గా అన్ని బెస్ట్ అయ్యినందుకు! 
Siri, Misha, Indu, Sid, krish.. you guys rock!
సరికొత్త adventures కోసం అందరం రెడీగా ఉన్నాం..
ఓ జీవితం, మరి నీకు ఉందా మమల్ని challenge చేసే సత్తా? 


Wednesday, March 16, 2011

వెన్నెల వాన!

నేను వాన కి వెన్నెల కి రెండిటికి అస్సలు ఫ్యాన్ కాదండి! 
ఈ రెండిటి వల్ల స్టార్స్ కనిపించవు అని ఒక కంప్లైంట్ అయితే.. హైదరాబాద్ బెంగుళూరు లో వాన పడ్డాక ఉండే చికాకు చూసి వాన వద్దు మహాప్రభో అనేది ఇంకో ఫీలింగ్.. కానీ వాన ని వెన్నెలని బాగా ఎంజాయ్ చేసిన రోజులు ఈ రోజు గుర్తుకు వచ్చాయి.. తెల్లవారకుండానే బీచ్ కి పరిగెత్తుకుని వెళ్లి.. మూన్ సెట్ చూసిన రోజులు, సముద్రంలో కాళ్ళు పెట్టి అలా వానలో తడుస్తూ గడిపిన ఎన్నో సాయంత్రాలు.. 
అదేంటో మరి సురత్కల్లో వాన చాలా అందంగా అనిపించేది.. ఆగకుండా పది రోజులు పడినా నచ్చేది.. బీచ్ వల్లనేమో.. లేదా ఆ ప్లేస్ అందం వల్లనేమో.. లేదా సోను ముంగారు మళే మేజిక్ వల్లనేమో :P
చైత్ర మాసం వెన్నెల ఒక్కటే సంవత్సరం మొత్తం లో చంద్రుడిలో నాకు ఇమ్ప్రేస్సివేగా అనిపించే విషయం.. అందుకే ఈ నెల ఒకసారి వాన కూడా చూడాలని ఉంది.. తడవాలని ఉంది.. 
ఓ వానా.. ఒకసారి నాకోసం మా ఊరు వచ్చేయ్!

Thursday, March 10, 2011

పాదాల ప్రేమిక :P

నేనే నేనే! కరెక్ట్ గానే చదివారు.. అది పాదమే పదం కాదు :D 
హహహ అసలు ఆ రోజులే వేరు... సరే సరే అసలు విషయం ఏంటంటే
నేను చదువుకునే రోజుల్లో.. మా క్లాసులో ఒక అబ్బాయి ఉండేవాడు.. ఎలా ఉండేవాడో నాకు కూడా పెద్దగ గుర్తులేదు ఇప్పుడు.. ఇక్కడ విషయం అది కాదు కానీ. ఆ అబ్బాయి పాదాలు భలే ఉండేవిలెండి.. 
ఈ పాదాలు బావుండటం ఏంటి అనుకోకండి.. ఎప్పుడైనా మీరు కూడా గమనించండి.. నేనేం మాట్లాడుతున్నానో తెలుస్తుంది.. 
అలా పాదాలు చూస్తూ నాలుగు సంవత్సరాలు గడిపేసాను.. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.. కాని ఎక్కడ ఉన్నా ఆ అబ్బాయి పాదాలు బావుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.. :D

Monday, March 7, 2011

దేవుడా.. ఓ మంచి దేవుడా!


ఏం దేవుడో ఏమో కాని.. ఈ మధ్య కొంచం ఎక్కువ సార్లు గుర్తు చేసుకున్నానులెండి :D
ఒకటి అర్థమైంది... మన దగ్గర ఉన్నవాటికి.. మనకి ఇచ్చిన వాటికి థాంక్స్ చెప్పి ఊరుకోవడం మేలు. కోరికలు కోరుకుని శుద్ద దండగ.. ఎన్దుకన్టారూ.. అవి తీరకపోతే లేదా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనుకోండి... అనవసరం దోస్తీ పోతుంది ఆయనతో.
కాని బాధగా ఉన్నప్పుడు మాత్రం ఎంత తలచుకుంటే అంత బెటర్.. ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. ఏదో కష్టం తీర్చెస్తాడు అని కాదు కానీ.. నీ వెనక నేను ఉన్నాను కమాన్ కమాన్ అని ఎవరో ధైర్యం ఇస్తున్న ఫీలింగ్. 
నే చాలా హ్యాపీగా ఉన్నప్పుడు కోరుకున్న కోరికలు చాలా వరకు తీరలేదు.. :D బాగా కోపం వచ్చింది.. ఛి పో అసలు ఈ మనిషి లేడు.. పిచ్చి వేస్ట్ అని అనుకున్నాను 
బాధగా ఉన్నప్పుడు మాత్రం చాలా చాలా తలచుకున్నాను.. స్వప్న దర్శనాలు లాంటివి ఏమి అవ్వలేదు కాని.. నా మీద నాకు కంట్రోల్ వచ్చింది అని మాత్రం చెప్పగలను..
దేవుడు ( అనే వాడు ఉంటే) కోరికలు తీర్చలేడు కానీ.. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మాత్రం ఇవ్వగలడు. నాకు ఇచ్చాడు.. థాంక్స్ (నాలోనే ఉన్న) కృష్ణ!

Wednesday, March 2, 2011

నేవేర్లాండ్, ఫైరి ల్యాండ్ లాంటివి ఎక్కడైనా ఉంటాయా అసలు ?

ఇలా నేను అలాంటి ప్లేసెస్ గురించి మాట్లాడితే చాలా మంది నన్ను అడిగారు.. అలాంటివి అసలు ఉండవని.. ప్రాక్టికాల్గా ఉండాలని చెప్పేవారు..
అసలు ఈ నేవేర్లాండ్లు ఫైరీలు ఎందుకు ఉండవండి? ఎందుకు అన్ని చోట్ల రూల్స్, తప్పు, ఒప్పు, అన్నీ ఆలోచించుకుని చెయ్యాలట.. హాయిగా స్వేచ్చగా ఉండలేమా? కోరుకున్న ప్రతిదీ మనకోసం దిగిరాకూడద??
ఏంజెల్స్ మనలోనే ఉండరా? నేవేర్లాండ్ మనం సృష్టించాలేమా? 
అంత కష్టమా వాటిని తిరిగి తీసుకుని రావడం?
నాకు ప్రాక్టికాల్గా ఉండాలని చెప్పెవారికంటే కూడా.. హ్యాపీగా ఉండాలని వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలని చూసేవాళ్ళు చాలా చాలా నచ్చుతారు.. 
నన్ను చాలా మంది ఆపేశారు.. అలాంటివి ఉండవు అని.. కాని అలాంటి వాటి గురించి డ్రీం చేసే వాళ్ళని నేను ఎప్పుడు ఆపలేదు.. మా బుడ్డి బిందుకి అలాంటివి ఉండవు అని ఎప్పుడు చెప్పలేదు.. 
మనం పుట్టగానే మనతో పాటు ఒక ఏంజెల్ కూడా తోడు వస్తుంది కదా.. చిన్నతనంలో ఉండే అమాయకత్వం పెద్దయ్యే కొద్ది ప్రాక్టికాలిటీ పేరున ఎక్కడో తప్పిపోతుంది.. :( ఆ ఏంజెల్ కి వెగటు పుట్టి మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది..
కాని ఇంకా అలానే ఉన్న ఏంజెల్స్ ని నేను చూసాను.. నా సిరి లాంటి వాళ్ళు ఏంజెల్స్లా ఉన్నారు ఇంకా.. :)
 నాకు మళ్లీ ఆ ప్రపంచానికి వెళ్లాలని ఉంది.. ఏంజెల్స్ ఫైరీస్ అండ్ మేజిక్! 
లేదు అంతటి హ్యప్పినేస్స్ ఎవరికన్నా ఇవ్వాలని ఉంది.. 
అలాంటివి ఉండవు అని చెప్పడం కంటే.. అలాంటి ఒక ఏంజెల్ నేను అవ్వాలని నాకు ఉంది..

Tuesday, March 1, 2011

నాకే ఎందుకిలా ?

లెక్కలేనన్ని సార్లు అనుకున్నాను నేను ఇలా.. నాకే ఏదో జరగరానిది జరిగిందనే భావనలో.. అలా అని ఏమి జరగలేదని కాదు..  కొన్ని సార్లు జరిగాయి కూడా. కాని ప్రతిసారి అనుకున్నాను.. నాతోనే ఇలా జరుగుతోందని.. నాకు వచ్చినన్ని కష్టాలు ఈ భూప్రపంచంలో ఇంకెవరికి రాలేదని.. ఈ భావసగారాన్ని నేను ఒక్కదాన్నే కష్టపడి ఈదుతున్నానని! అలా అనుకోవడం పెద్ద పాపం అయితే కాదని మాత్రం అర్థమైంది.. ఆ నిమిషంలో, అనుభవిస్తున్నప్పుడు అలానే ఉంటుంది.
ఎవరు ఎంత చెప్పటానికి ప్రయత్నించిన అది మాత్రం బుర్రకి ఎక్కదు..  ఎక్కలేదు..
ఈ రోజు కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తుంటే.. ఆలోచనలు నన్ను నడిపాయా లేదా నేను ఆలోచనలను నడిపించానా అనిపిస్తోంది.. కచ్చితంగా ఆలోచనలు నన్ను నడిపించాయి .. నాకే ఎందుకిలా అని అనుకుని.. నాలో బాధని ఇంకా పెంచుకున్ననే కాని.. తగ్గించుకోలేకపోయాను.. అవును నొప్పించే విషయమే జరిగింది.. కాని అది జరిగిపోయింది. జరిగిపోయిన దానిలోనే బ్రతికాను.. నా ఆలోచనలకి బానిసని అయ్యాను.. తెలియాల్సి వచ్చిన రోజున అన్ని తెలిసి వస్తాయి అన్నట్టు.. నాకు తెలియాల్సిన రోజు తెలిసి వస్తోంది.. కొందరికి ముందు.. కొందరికి వెనక.. అంతే తేడా.. 
కానీ ఒక ఆలోచన నన్ను నడిపింది అన్న భావన ఎందుకో నాకు అంతగా నచ్చటం లేదు.. అది మంచి ఆలోచన ఐనా.. చెడ్డదైనా.. బాధ కలిగించేది ఐనా.. ఎటు వంటిది అయినా.. 
ఈ ఆలోచనలు నాకు నచ్చలేదు.. వీటికి దూరంగా ఉండాలని ఉంది.. 
నన్ను నా నుంచి దూరం చేస్తున్న ఏ ఆలోచన నాకు నచ్చట్లేదు.. అది ఎంత మంచిది ఐనా కూడా.. నాకు ఆలోచనలు లేని స్థితి కావాలి.. నా కృష్ణుడు మాత్రమే ఉండే స్థితి.. :)