Monday, May 30, 2011

మరణానికో ప్రేమ లేఖ నే రాయలేనా??


జీవితానికి  ప్రేమ  లేఖ  రాయాలని  మొదలు  పెట్టి  ఎవరో  మరణానికి  ప్రేమ  లేఖ  రాసేసారు .. కానీ  idea నచ్చింది  నాకు .. జీవితం  కంటే  మరణం  గొప్పదా ? అంటే  ప్రేమలేఖ  రాసే  అంత  గొప్పదా  ani?

గొప్పదే  అనిపించింది ..

మార్పు ని  తెస్తూ .. కొత్తదనాన్ని  పంచుతూ .. బహుశా  మరణం  మనకి  తెలియకుండానే  మన  జీవితంలో  భాగమేమో .. or may be మరణమనే  ఒక  పెద్ద  సెట్  లో  జీవితమే  ఒక  చిన్ని  subset ఏమో !

మరణం  అనే  word ఎందుకు  ఈ  రోజు  ఇంత  మధురంగా  అనిపిస్తోంది ?

తలచుకుంటేనే  ఏదో  ప్రశాంతత .. రుద్ర  భూమి  పైన  ప్రేమ .. బూడిదతో  ఏదో  అనుబంధం ..

మరణం  నువ్వు  చాలా తెలిసిన  వాడిలా  అనిపిస్తున్నావు ..

నీకోసం  ఎదురు  చూస్తూ  నేను  గడిపాలి  ఒక  జీవిత  కాలం .. నిన్ను  చేరాలనే  ఆశతో.. నవ్వుతు  ఏడుస్తూ .. నాలో  నిన్ను  శోధిస్తూ.. ఒకరోజు  నిన్ను చేరుకుంటాను  ప్రియతమా ..

అమావాస్య  చంద్రుడిలా  నువ్వు .. కంటికి  కనపడక .. కవ్విస్తూ .. ఊరిస్తూ .. గడియలు .. రోజులుగా .. గంటలుగా .. నా  జీవితంగా  మారి .. నీకై  ప్రయాణం  చేస్తున్నాయి ..

దక్షిణా మూర్తిగా    నువ్వు .. నీ  ఉత్తరాముఖిగా  నేను .. ఎన్నాళ్ళింకా  నీ  ధ్యానంలో ... దిక్కులు  కలిసే  వేళ.. నీ  కౌగిలిలో  చేరి  అనంతంలో  కలిసిపోవాలనే  కోరిక ..

నిన్ను  నన్ను  దూరంగా  ఉంచుతున్న  ఈ  జీవితం  నాకు  శత్రువు .. నా  జీవితాన్ని  కరిగించి .. నీ  జీవితాన  వెలుగుగా  మారాలనే  తపన ..

Wednesday, May 25, 2011

సేల్ సేల్ !


పాతికేళ్ళ అబ్బాయి ఉన్న (ఆల్మోస్ట్ చాలా మంది) తల్లి తండ్రుల మెడల్లో వేలాడే బోర్డు "మా అబ్బాయి అమ్మకానికి కలడు (Negotiable)"   
మీరు ఎంత ధర పెట్టి కొనుక్కుంటారు అనే దానినిబట్టి మీ అమ్మాయి ఎలా ఉండాలో వాళ్ళు చెప్తారు.. చాలా మంచి ధర పెట్టి కొనుక్కుంటే మీ అమ్మాయి కి పెద్దగా ఇంటి పని వంట పని రాకపోయినా పెద్దగా చదువు లేకపోయినా పర్లేదండి.. పని మనిషిని పెట్టుకుంటారు.. మీరిచ్చిన డబ్బుతో అబ్బాయి అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాడు.. మీ అల్లుడు చాలా మంచి వాడి రూపం ధరిస్తాడు.. అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా కాపాడతారు..

ఇక ధర తగ్గినా కొద్ది.. అమ్మాయి రోబోట్లా ఉండాలి.. ఇంటి పని వంట పని ఆఫీసు పని.. ఆ  పని ఈ పని అని చూడకుండా అన్ని చేసెయ్యాలి.. పాపం ఇన్ని చేసాక కూడా వచ్చే మాటా.. అసలు ఈ కాలం అమ్మాయిలు బొత్తిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వరండి..
మా ఇంట్లో మా బావగారిని చూస్తె మా చెడ్డ చిరాకుగా ఉంటుంది.. అబ్బో ఎంచక్కా కలిసిపోతారో అసలు అందరితో.. ఎంచక్కా మాట్లాడేస్తారో.. మా అక్కని ఎంచక్కా చూసుకుంటారో.. చక్కటి అల్లుడు దొరికాడని ఊరు వాడా చెప్పుకుంటారు.. కానీ మా తాతగారు ఒకసారి అన్నారండి.. ఊరికే రాలేదు అతను.. పాతిక లక్షలు పోస్తే వచ్చాడని..

ఇలా మా బావగారిలాంటి వాళ్ళని.. ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమందిని అడిగాను.. ఎందుకు ఇలా డబ్బుకి అమ్ముడు పోతారని.. వాళ్ళు ఇచ్చిన సమాధానం.. మాకు ఇలాంటి expectations  ఏమి లేవు.. అమ్మ నాన్న లు ఇలా చేసేది అని.. పాతికేళ్ళు వచ్చి తల్లి తండ్రులనే ఒప్పించలేని వాళ్ళు.. వీళ్ళు జీవితాన్ని ఎం నెట్టుకుని వస్తారండి.. ?

వీళ్ళు కంపెనీలో లీడ్ ఇంజనీర్ , దేవేలోప్మేంట్ మనజేర్స్ అండి.. They are working in the company becos they are being paid.. they are getting married becos they are being paid.

ఇలాంటి వాళ్ళు కోకొల్లలు.. మీరు కూడా అయ్యే ఉంటారు..

Tuesday, May 24, 2011

గతం ఎంత వరకు గతః?


నిన్న సాయంత్రం ఏదో టైం గురించి ఆలోచిస్తూ.. అసలు టైం అంటే ఏంటా.. ఎలా డిఫైన్ చేస్తారా అని ఏదో పిచ్చి ఆలోచనలలో ఉన్నప్పుడు.. అసలు past present future అనేవి అసలు ఏంటా అని ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాను.. గతంలోకి..

ఇంతకీ గతం గతః అని అనుకోవడం కరెక్ట్ ఆహ? I'm a better person today.. కాని దీనికి కారణం చాల వరకు నా పాస్ట్ అనే అనుకుంటున్నాను.. నేను చేసిన పిచ్చి పనులు (తప్పులు అని నేను అనుకోవటం లేదు :D) , నే కలిసిన మనుషులు.. నాకు దూరంగా వెళ్ళిపోయినా మనుషులు.. పరిస్థితులు.. హ్మ్ ఇది నేను.. :D గతాన్ని మర్చిపోవాలి అని అనిపించదు.. గుర్తు చేసుకోవాలని అసలు ఉండదు. స్పేస్-టైం వార్ప్ అంటూ ఉండి టైం ట్రావెల్ చేయ్యోచు అంటే మీరు ఎక్కడికి వెళ్తారు?

Saturday, May 21, 2011

మన గురించిన కొన్ని observations

౧. మనం చాలా చాలా బాడ్ managers... ఒక్క సరైన లీడర్ ని చూడలేదు ఆఫీసు లో.. :( 
౨. ప్రెజర్ హేండిల్ చెయ్యడం అసలు రాదు.. పీపుల్ మేనేజ్మెంట్ అసలు అడగక్కరలేదు.. 
౩. నీకెంత హైక్ నీకేం promotion .. ఇవే ఉంటాయి discussions . చాలా బోరింగ్ సెట్ అఫ్ పీపుల్..
౪. లోకం ఎంత ముందుకు వెళ్ళిన.. ఏమి జరిగిన.. ఇంకా కులం మతం వీటినే పట్టుకుని వేలాడటం కేవలం మనకే సొత్తు.. దానికి మనం పెట్టిన పేరు.. మన కల్చర్.. హ్మ్మ్
౫. పైన వాడు ఎం చెప్తే వాటికి ఊ కొట్టడం.. ప్రశ్నించకపోవడం..
౬. ప్రపంచం లో ఉన్న జ్ఞ్యానం అంతా మనకే ఉందని ఫీల్ అవ్వడం..
౭. బావిలో కప్పల్లా ఉండటం.. 
౮. ఆడ మగ ఆడ మగ ఈ గొడవల్లోనే ఫామిలీస్ ఉండటం.. ఈగో!
౯. ప్రేమించాను అని ఇంట్లో చెప్తే మొదటి ప్రశ్న: మన కులమేనా? కాదు అంటే మర్చిపో అంతే.. రెండో మాట లేదు.. అసలు ప్రేమ అర్థమవుతుందా మన రోబోట్స్ కి?
౧౦. ఫామిలీస్ లో భార్య పెత్తనమో.. భర్త అధికారమో ఉంటుంది కానీ.. ఇద్దరు సమానంగా ఉన్న ఫామిలీస్ చాలా అరుదు.. 
౧౧. డబ్బు అనే జబ్బు తో అందరు suffer అవ్తున్నారు..


ఇక్కడ మనం అంటే సౌత్ ఇండియాన్స్.. :-/

Thursday, May 19, 2011

Daughter of Poseidon!

నేను సముద్రానికి పుట్టానని నా ఫీలింగ్.. ఎందుకంటే నాకు బీచ్ చాలా నచ్చేస్తుంది.. ప్రశాంతంగా ఉంటాను.. 

ఈ రోజు ఒక సముద్రం.. వాళ్ళ ఆఫీసులో పిల్లలని workspace కి తీసుకుని వెళ్ళే ఏదో రోజు ఉందట.. నన్ను వాళ్ళ అమ్మాయిగా రమ్మని అడిగారు.. నచ్చేసింది!! 

మాయా శశిరేఖ!

మాయాబజార్లో NTR, SVR ఒక రేంజ్ అయితే.. అబ్బా అసలు మయా శశిరేఖగా సావిత్రి సూపర్! తన పెళ్ళికి తనే పాట పాడేసుకుంటూ.. తిప్పలు తనకి కాదు వచ్చే వాడికి అని చెప్తూ.. ఆహ.. అమ్మాయి అంటే అలా ఉండాలి.. :D

మాయాబజార్ పిచ్చి ముదిరిపోయి.. పెళ్లి చూపుల్లో నేను అబ్బాయికి మాయాబజార్ క్విజ్ పెట్టాలని నేను సత్య డిసైడ్ కూడా చేసాం :D టెస్ట్ లో పాస్ అయినవాడే అర్హుడి కింద.. modern స్వయంవరం :D

అసలు ఈ రోజు మాయా శశిరేఖ ఎందుకు వచ్చిందంటే.. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఏవో పెళ్లి చూపులు జరిగాయట.. ఎం జరిగింది అంటే.. రెండు రౌండ్స్ టెక్నికల్ ఒక రౌండ్ HR అని చెప్పుకుని వచ్చింది పాపం.. ఆ అమ్మాయి చెప్పే విధానం చూస్తే హహహ నాకెందుకో శశిరేఖ గుర్తుకు వచ్చింది... 

అందమైన.. తెలివైన ఆడపిల్లల్లారా.. మీకే ఈ పాట.. కొంచం నేర్చుకోండి.. గయ్యాళి తనమే అందం :D

ఆనందో బ్రహ్మ!!!!

బెంగుళూరు ఎంత బావుంటుందో అర్థం అవ్వాలంటే వేసవిలో ఓ సారి తప్పక అలా ఆంధ్రా వెళ్లిరావాల్సిందే... తప్పని పరిస్థితుల్లో వెళ్లాను.. తిరిగి వచ్చేసరికి ఇక్కడ వానలు మొదలు. ఎంత హ్యాపీగా ఉందంటే.. వానాకాలానికి ఫ్యాన్ కాని నేను కూడా వానని పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతున్నాను .. ఈ మధ్య కాబ్ లో .. బుక్ చదవకుండా హాయిగా బెంగుళూరు మహానగరాన్ని చూస్తూ వస్తున్నాను... ఎందుకో ఆ పిచ్చి M.G.రోడ్ .. పిచ్చి ట్రాఫ్ఫిక్ .. అన్ని అన్నీ నచ్చేస్తున్నాయి...
I'm falling in love with this city!
... yeh mausam kaa jaadu hai mitwa...!!!!