టైం అంటే "measure of growth/change" అని కొందరు, "locating the events" అని కొందరు అన్నారు ఈ రోజు. మరి అలాంటప్పుడూ vaccuum లో టైం ఉంటుందా? universe లో చాలామటుకు vaccuum అయినప్పుడు, టైం ఏంటి అప్పుడు? :(
పగిలిన గ్లాస్ కి మళ్ళి వెనక్కి మములుగ ఎందుకు చెయ్యలేము.. ఎందుకు వెనక్కి వెళ్ళలేము? మనని ఏది ఆపుతుంది? సమయం ముందుకే వెళ్తుందీ అంటే అసలు ముందుకు ఏం వెళ్తోంది? I'm confused.. :(
Wednesday, August 24, 2011
Monday, August 22, 2011
శభాష్ ఇండియా!
సంవత్సరం క్రితం, తెలంగాణా ఆందోలణకారులు హైదరాబాద్లో విధ్వంసం సృష్టించారు.. తెలంగాణా కావాలంటూ. ఎటు చూసినా పగిలిన గాజు పెంకులు, తగలపడిన బస్సులు. భయమేసింది ఎక్కడ ఉంటున్నాం అని.. ఎటెళ్తున్నామని.
ఈ రోజు లక్ష మంది ర్యాలీ చేస్తూ కూడా.. ఎక్కడా ఎటువంటి గొడవా లేకుండా.. వారు చెప్పాలనుకున్నదీ, చాటాలనుకుంటున్నది.. సౌమ్యంగా, అహింసాపూర్వకంగా చెప్తూ.. హౌరా !ఇది మన భారతమేనా అనేలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వైనం నిజంగా అభినందనీయం.
అన్నా హజారేను సపోర్ట్ చేస్తున్నారు అనటం కంటే.. ఒక 'కాజ్' ని సపోర్ట్ చేస్తున్నారు అనటం కరెక్ట్ ఏమో..
అప్పటికీ ఇప్పటికీ ఉన్నా తేడా ఒక్కటే.. ఒక సమర్ధవంతుడైన నాయకుడు..
మన దేశం ప్రపంచంలో అగ్రగామి అవ్వాలంటే ఇలాంటి నేతలు ఎందరో కావాలి.. కాని ఈ రోజు భారతావనిని చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది.
జై హింద్!
పరిత్రాణాయ సధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్ధాయా సంభవామి యుగే యుగే
"యే కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధినొందునో, ఆయా సమయములయందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సమ్రక్షణముల కొరకు ప్రతీ యుగమున అవతారము దాల్చుచున్నాను"

Saturday, August 20, 2011
పోయినోళ్ళందరూ మంచోళ్ళు..
తెలిసిన ఒక తాతగారు వెళ్ళిపోయారు.. తెలియదు ఎక్కడికో.. కానీ మనం మళ్లీ మాట్లాడలేనంత దూరాలకి వెళ్లిపోయారట..
జ్ఞాపక శక్తి తగ్గిపోతోన్డంమా అని చెప్పారు పోయినసారి కలిసినప్పుడు.. మీ జ్ఞాపకాలు వదిలి వెళ్ళారా తాతయ్య.. మీరు ఇప్పుడు వెళ్ళిన వరల్డ్ ఇక్కడికంటే బావుండాలి అని ఆశిస్తున్నాను..
ఐ'ల్ మిస్ యు తాతగారు..
Thursday, August 18, 2011
సమాగమము
నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాను.. నిన్ను పట్టుకోవలనుకున్నాను.. నిన్ను దాచుకోవలనుకున్నాను.. కానీ తెలుసుకున్నాను.. నువ్వు శూన్యం అని.. నిన్ను ఎలా పోల్చను?
నన్ను నిన్ను కలిపి ఒక అందమైన చిత్రం వేద్దామనుకున్నాను .. రకరకాల రంగులతో.. నీ మీద నా ప్రేమకు గుర్తుగా.. కానీ తెలుసుకున్నాను.. నువ్వు అంధకారమని.. ఏ రంగుతో నిన్ను చూపెట్టేది?
భక్తీతో నీ కీర్తనలు స్తుతిన్చాలనుకున్నాను.. నువ్వు ఓంకారనివన్నావు .. అంతకన్నా గొప్పగా నేనిన్కేమి పాడగలను..
భవహర.. నిన్ను ఎలా ధ్యానించను..
Tuesday, August 9, 2011
సంధ్యారాగం
శ్రావణ సంధ్య వేళ వెలుగుని హరించి చీకటి కమ్ముకుంటుంటే, అస్తమ సమయం కొత్త ఆశలు రేపుతోంది..
మరి కాసేపట్లో చీకటి కమ్ముకుంటుందని.. మన లోకం తిరిగి వస్తుందని.. నువ్వు వస్తావని..
లోకమంతా అంధకారంగా భావిస్తుంది నిన్ను.. నువ్వే నా లోకంగా జీవిస్తున్న నేను..
నిన్నే ధ్యానిస్తూ.. నీలో నన్ను శోధిస్తూ.. నిన్ను కలిసే ప్రయత్నంలో అనుకోకుండా దారిలో నన్ను నేనే కలుస్తున్నాను..
జీవిత పరమార్థం తెలిపే యోగివి నువ్వు..
వెలుగురేకలు వచ్చి చీకట్లు కమ్ముతుంటే.. నువ్వు వచ్చి జీవితంలోని అంధకారాన్ని తొలగించావు.. నా జీవితంలో వెలుగునిచ్చావు.. నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నావు..
ఊపిరి పీల్చుకోవడమే జీవించడమా ? కాలంతో పాటు పరుగేత్తడమేనా బ్రతకడం అంటే?
నీ ఉనికి తెలిపింది జీవితంలోని మాధుర్యం.. నీ ధ్యానంలో గడపడటమే నా జీవితం..
నా ప్రియుడివి నువ్వు.. మృత్యువువి నువ్వు..
నీకై ఎదురు చూసే నీ ప్రియసఖిని నేను ..
Labels:
Hara
Monday, August 8, 2011
ఫ్రీ బర్డ్ అనగా ఎవరు?
జోనాథన్ లివింగ్స్టన్ అని చెప్పొద్దు :P
ఆయనగారు ఎలానూ ఫ్రీ నే.. మనలో ఎవరబ్బా అని.. అసలుంటారా అని?
ఉన్నారండి.. కానీ conditional గా ఉన్నారు.. ఎప్పుడూ ఎల్లప్పుడూ లేరు..
అలాంటి ఫ్రీ బిర్ద్స్ ఉంటే చూడాలని ఉంది.. కలవాలని ఉంది.
నా కొత్త కోరికలు
౧. అలా బ్రెయిన్ లో దూరిపోయి neurons ఎలా మాట్లాడుకున్తాయో తెలుసుకోవాలని ఉంది.. మొత్తం ఫ్లో పట్టాలని ఉంది ..
౨. DNA sequencing అర్థం చేసుకోవాలని ఉంది. నాకు నచ్చిన functionality కి లింక్స్ తాయారు చెయ్యాలని ఉంది.
౩. అసలు ఏ atomలో defect వస్తే జబ్బులు వస్తాయో తెలుసుకోవాలని ఉంది
౪. మొత్తానికి ప్రాణాన్ని అటమిక్ scale లో చూడాలని ఉంది..
Thursday, August 4, 2011
టూర్లు ట్రిప్లు నా అభిప్రాయాలు!
మొన్నామధ్య కుషాల్నగర్ వెళ్ళొచ్చాకా ఒకటి మాత్రం బాగా అర్థమయింది.. మనకు బాగా నచ్చిన చోట్లకి సాధ్యమయినంత వరకు ఒంటరిగా వెళ్ళాలి.. లేదా మహా అయితే ఇంకో ఇద్దరు మనుషులతో అంతే.. అక్కడ కూడా ప్రశాంతత కరువయింది.. అది కూడా బెంగళూరు లా అనిపించింది..
అందుకే ఇక నుంచి నాకు నచ్చిన చోట్లకి.. నేను చుట్టాలతో ఫ్రెండ్స్తోవెళ్ళతలచుకోలేదు!!
నాకు నచ్చిన ప్రపంచం కేవలం నా కళ్ళతోనే :D
అందుకే ఇక నుంచి నాకు నచ్చిన చోట్లకి.. నేను చుట్టాలతో ఫ్రెండ్స్తోవెళ్ళతలచుకోలేదు!!
నాకు నచ్చిన ప్రపంచం కేవలం నా కళ్ళతోనే :D
Subscribe to:
Posts (Atom)