Saturday, December 31, 2011

డిసెంబర్ ౨౧న ప్రపంచం ఎండ్ అవ్వకూడదు.. ఎందుకంటే

౧. నాకు లాబ్లో మనిషిని పుట్టించే రోజు చూడాలని ఉంది..
౨. వేరే ప్రపంచాలలో ఎక్కడైనా ప్రాణం ఉంటే.. అది తెలిసే రోజు వచ్చే వరకు మనం ఉండాలి..

ఇన్నేళ్ళ శ్రమ వృధా అవ్వకూడదు..

Sunday, December 11, 2011

అయ్యో పాపం చందమామని పాము మింగేసింది అంట..

చిన్నప్పుడు చంద్ర గ్రహణం చూసి ఏంటి అది అని అడిగితే మా అమ్మమ్మ ఇదే చెప్పింది. నిన్నటి గ్రహణం చూస్తుంటే .. మన నీడని చందమామ మీద చూస్తుంటే..  ఇంత పెద్ద భూమిని అంత చిన్న నీడలో చూసేయ్యడం భలే అనిపించింది. Universe తన secrets మనకి కళ్ళముందే ఉంచిన .. చాలా సార్లు మనం చూడలేకపోతాం  అనడటానికి గ్రహణాలు ఒక example.